Benefits Of Black Cumin: నల్ల జీలకర్ర గురించి మీకు తెలియని రహస్యాలు

Benefits Of Black Cumin

Benefits Of Black Cumin: నల్లజీలకర్రను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ విత్తనాల పొడిని బ్రెడ్, బిస్కెట్లు, రొట్టెలు, సూప్స్ లలో తీసుకుంటారు. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ను ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తేనె, నల్ల జీలకర్ర పొడి, వెల్లుల్లి పొడిని కలిపి ఔషదంగా తయారు చేస్తారు. దీనిని వాడితే జలుబు, దగ్గు తగ్గుతాయి. నల్ల జీలకర్ర పొడి ఉల్లి, మిరియాల రుచిని తలపిస్తుంది. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, మాంగనీస్, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజ పోషకాలు ఉంటాయి. హానికారక బాక్టీరియా, సూక్ష్మ జీవుల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది. మరి వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేగును రక్షిస్తుంది
నల్ల జీలకర్ర మరియు థైమోక్వినోన్ (నల్ల జీలకర్రలో ఉంటాయి) బ్యాక్టీరియాతో పోరాడి.. నెక్రోటైజింగ్ అల్సరేటివ్ కొలైటిస్‌ను నివారిస్తాయి.

ఆస్తమాను నివారించవచ్చు
నల్ల జీలకర్రను పొడిరూపంలో తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు , గొంతు నొప్పి ఇతర శ్వాస సమస్యలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

మెథిసిలిన్-నిరోధక

నల్ల జీలకర్రలో యాంటీమైక్రోబయల్,యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు ఉంటాయి, ఇవి బ్యాక్టీరియాను నిరోధించడంతో పాటు.. ఇన్పెక్షన్ల నుండి కాపాడుతుంది.

రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది
నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని పలు అద్యయనాలు చెబుతున్నాయి.

మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది.
నల్ల జీలకర్రను గ్లాసు వాటర్ కలిపి మరిగించి తీసుకుంటే.. మూత్రపిండాల్లో ఉండే రాళ్లను కరిగిస్తుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మహిళల ఆరోగ్యం
నల్ల జీలకర్రలో ఇనుము, కాల్షియం వంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పాలిచ్చే తల్లులకు, గర్భిణీలు ఇవి తింటే మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నల్ల జీలకర్రను ప్రతిరోజు తినడం వల్ల పీసీఓడీని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది
నల్ల జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

తరవాత కథనం