Crime Story: బతికి ఉండగానే కళ్లు, వెంటుకలు పీకేసి.. 53 మందిని చంపిన అగాంతకుడు, ఎందుకో తెలిస్తే వణికిపోతారు

Image Credit: Pixabay
మీరు ‘రాక్షసుడు’ సినిమా చూశారా? చివరి క్షణం వరకు ఉత్కంఠతో బుర్రపాడు చేసే టెన్షన్‌తో సాగే ఈ సినిమా ఒక వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిందనే సంగతి మీకు తెలుసా? అతడి చేతికి చిక్కిన అమ్మాయిలను అత్యాచారం చేయడమే కాదు.. వారు బతికుండగానే.. కళ్లు, వెంటుకలు పీకేసేవాడు. ఆ తర్వాత ముఖాన్ని చెక్కేస్తూ అతి క్రూరంగా చంపేసేవాడు. ఇలా దాదాపు 53 మందిని హత్యాచారం చేశాడు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవ్వరో తెలుసా? ఆండ్రీ చికాటీ. పేరులోనే ‘చీకటి’ పెట్టుకున్న ఇతడు రష్యాకు చెందినవాడు.
ఆండ్రీ చికాటీని బుట్చర్ ఆఫ్ రోస్టోవ్, రెడ్ రిప్పర్, రోస్టోవ్ రిప్పర్ అనే పేర్లతో కూడా పిలిచేవారు. ‘రాక్షసుడు’ సినిమాలో టీచర్ పాత్రకు స్ఫూర్తి ఈ కిల్లరే. ఆ సినిమాలో టీచర్ ని హంతకుడిగా చూపించక పోయినా ఆండ్రీ బిహేవియర్ కూడా ఆ క్యారెక్టర్ లానే ఉండేది. ఆండ్రీ టీచర్‌గా పనిచేసిన రోజుల్లో విద్యార్థినులను లైంగికంగా వేధించేవాడు. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం అతడిని సస్పెండ్ చేసింది.
అలా మొదలైంది..
అతడిని స్కూల్‌ నుంచి గెంటేయడం.. మరింత కుంగదీసింది. దాన్ని తీవ్ర అవమానంగా భావించాడు. ఓ పాత ఇంటిని కొనుగోలు చేసి అందులోనే ఒంటరిగా ఉండేవాడు. 1978లో అతడు మొదటిసారి క్రూరమైన నేరానికి పాల్పడ్డాడు. తొమ్మిదేళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా రేప్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. అక్కడే ఒక విషయం తెలిసింది. అతడికి అంగ స్తంభన సమస్య ఉందని. ఆ కోపంతో వాడు మరింత రాక్షసుడిలా మారాడు. దీంతో ఆమె మర్మాంగాన్ని చీల్చేశాడు. ఆ తర్వాత కత్తితో పొడిచాడు. ఆమె నొప్పితో విలవిల్లాడుతున్న సమయంలో అతడి అంగం స్తంభించింది. దీంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మరణించిందని తెలుసుకున్నాక.. గ్రుసెవ్కా నదీలోకి విసిరేశాడు.
నేరం ఒకరిది.. అనుమానం మరొకరిపై..
రష్యాలో అప్పటికే అలెగ్జాండర్ క్రావెచన్కో అనే హంతకుడు వరుస హత్యలతో ఫేమస్ అయ్యాడు. ఆమెను అతడే చంపి ఉంటాడని పోలీసులు బావించారు. దీంతో అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అది చలికాలం కావడంతో అతడి ఇంటి చుట్టూ మంచు కప్పేసి ఉంది. ఆ మంచుపై కొన్ని రక్తపు చుక్కలు కనిపించాయి. దీంతో పోలీసులు తమ అనుమానమే కరెక్ట్ అనుకున్నారు. అలెగ్జాండర్ ఈ హత్య చేసి ఉంటాడని నిర్ధరించుకున్నారు. కానీ, ఆ రక్తపు మరకలు ఆ అమ్మాయివి కాదని, తనవేనని అలెగ్జాండర్ భార్య వెల్లడించింది. రక్త పరీక్షల్లో అది నిజమేనని తేలడంతో పోలీసులు జుట్టు పీక్కున్నారు. ఆండ్రీయే ఆ హత్య చేశాడని అస్సలు ఊహించలేకపోయారు.
అమ్మాయిలనే కాదు.. అబ్బాయిలను కూడా.. 
ఇది ఆండ్రీకి బాగా కలిసి వచ్చింది. నెమ్మదిగా హత్యలు చేసుకుంటూ పోయాడు. కేవలం అమ్మాయిలనే కాదు.. మగ పిల్లలను కూడా కిడ్నాప్ చేసి.. టార్చర్ చేసి బలత్కారం చేసి చంపేశేవాడు. వాళ్ల శవాలపై తన వీర్యాన్ని చల్లి అడవుల్లో వదిలేశేవాడు. అలా దాదాపు 12 ఏళ్లు హత్యల పరంపర సాగింది. దాదాపు 53 మందిని చంపేశాడు. అయినా పోలీసులకు క్లూ దొరకలేదు. చివరికి.. ఓ సారి దొరికాడు. కానీ..
అతడి వీర్యమే రక్షించింది
తప్పు చేసినవాడు ఏదో ఒక రోజు చట్టానికి చిక్కక తప్పదు. అలా ఆండ్రీ కూడా దొరికిపోయాడు. అయితే, శవాలపై దొరికిన వీర్యం.. అతడి బ్లడ్ గ్రూప్‌కు మ్యాచ్ కాలేదు. ఆండ్రీ బ్లడ్ గ్రూప్  A. కానీ వీర్యం శాంపిల్స్ మాత్రం AB గ్రూప్‌గా చూపించాయి. అప్పట్లో మరింత లోతుగా పరిశోధనలు చేసేంత టెక్నాలజీ లేదు. దానివల్ల ఆండ్రీ బతికిపోయాడు. మరి, ఆ వీర్యం, బ్లడ్ గ్రూప్ ఎందుకు మ్యాచ్ కాలేదనేది చిక్కుముడిగా మారింది. అది జరిగిన కొద్ది రోజులకు ఆండ్రీ తనతో పనిచేసే ఓ ఉద్యోగి వస్తువులను దొంగిలించాడనే కారణంతో అరెస్ట్ అయ్యాడు. జైల్లో మూడు నెలలు గడిపాడు. అప్పటికే వాడు 23 మందిని చంపేశాడు. జైల్లో ఉన్న మూడు నెలలు ఎలాంటి హత్యలు జరగకపోవడంతో పోలీసులకు ఆండ్రీపై అనుమానాలు బలపడ్డాయి.
1990లో చేసిన మరో హత్య కేసులు ఆండ్రీ అరెస్టయ్యాడు. ఈ సారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. శవంపై ఉన్న అతడి ఉమ్మి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా అతడి బ్లడ్ శాంపిల్స్‌తో మ్యాచ్ అయ్యాయి. కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. ఆండ్రీ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతడి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. చివరికి అతడు ఆ దేశ అధ్యక్షుడు బోరిస్ యెల్టిసిన్‌కు కూడా విన్నవించుకున్నాడు. ఆయన ఆ అప్పీల్‌ను తిరస్కరించడమే కాకుండా.. వీలైనంత త్వరగా అతడికి శిక్ష విధించాలని ఆదేశించారు. దీంతో 1994, ఫిబ్రవరి 14న నుదిటిపై గన్‌తో షూట్ చేసి మరణ శిక్ష అమలు పరిచారు. అలా ఆ రాక్షసుడిని అంతం చేశారు.

తరవాత కథనం