HMPV Virus: కరోనా వైరస్ మనల్ని ఎంతగా కలవర పెట్టిందో తెలిసిందే. యావత్తు ప్రపంచానికి నరకం చూపించిన ఈ వైరస్.. ఇప్పుడు తగ్గుముఖం పట్టినా ఆ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో మొదలైన మరో వైరస్ కూడా.. భయాందోళనలు కలిగిస్తోంది. హెచ్‌ఎంపివి (Human Metapneumovirus)గా పిలుస్తున్న ఈ వైరస్ ఇప్పుడు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులోకి ప్రవేశించిన ఈ వైరస్.. మరింత మందికి సోకే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వైరస్‌ను మనం సీరియస్‌గా తీసుకోవాలా? అసలు దీని లక్షణాలు ఏమిటీ? ఇది ఎలా మొదలైంది?
బాధితులంతా పిల్లలే..
ఈ వైరస్ ప్రభావం పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, సీజనల్ స్పైక్ అని చైనా అధికారులు తెలుపుతున్నారు. చలికాలం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వైరస్ విషయంలో పెద్దగా ఆందోళన అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలని తెలుపుతున్నారు.
హెచ్‌ఎంపివి వైరస్, లక్షణాలు ఇవే..
హెచ్‌ఎంపివి ఒక వైరస్, ఇది మామూలుగా ఒక సాధారణ శ్వాసకోశ సంక్రమణను కలిగిస్తుంది. ఇది సోకగానే ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వాస్తవానికి చైనాలో ఈ వైరస్ చైనాలో పుట్టిందని భావిస్తున్నారు. వాస్తవానికి 2001లో నెదర్లాండ్స్‌లో మొదటగా ఈ వైరస్‌ను గుర్తించారు. అక్కడి నుంచే ప్రపంచంలో వ్యాపించింది. దీని లక్షణాలు జలుబు, జ్వరం తరహాలోనే ఉంటుంది. అందుకే, దీన్ని కనిపెట్టడం కూడా కష్టమే. అయితే, దీని వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించాలి.
హెచ్‌ఎంపివి ఒకరి నుంచి ఒకరికి వేగంగా సంక్రమిస్తుంది. అలాగే బాధితులు ఉపయోగించిన వస్తువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ పిల్లలతో పాటు పెద్దవారిలో కూడా వ్యాప్తి చెందుతుంది, అయితే పిల్లలు, ముఖ్యంగా రెండు సంవత్సరాల కంటే చిన్నవారికి ఈ వైరస్‌కు మరింత వేగంగా సంక్రమిస్తుంది.
చలికాలం కావడంతో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఉత్తర చైనాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో కూడా ఎక్కువ మంది చిన్నారులే ఈ వైరస్‌కు గురయ్యారు. ఇండియాతోపాటు సౌత్-ఈస్ట్ ఆసియా దేశాలు, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాలలో కూడా హెచ్‌ఎంపివి కేసులు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. చైనాలో ఈ కేసులు 2024 అక్టోబర్ నుంచి పెరిగాయి.
హెచ్‌ఎంపివి, కోవిడ్-19 మధ్య తేడా ఇదే
కోవిడ్-19తో పోల్చితే హెచ్‌ఎంపీవీ కేసులు అంత ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ వల్ల కోవిడ్-19 మహమ్మారి మళ్లీ ఉనికిలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. హెచ్‌ఎంపీవీ సుమారు 10 ఏళ్ల నుంచి ఉనికిలో ఉంది. దాని తర్వాత పుట్టినదే కోవిడ్ 19. అలాగే హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదు. అయితే, ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉన్నవారు, ముఖ్యంగా వృద్ధులు, కేన్సర్ రోగులు, పసికందులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు.
హెచ్‌ఎంపివి కేసులు పెరిగినప్పటికీ ఆందోళన వద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ నుండి రక్షణ కోసం, మాస్కు ధరించడం, శుభ్రత పాటించడం మంచిది. అలాగే గ్రూపులకు దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి.