Is Sugar Veg or Non Veg?: మాంసాహారులను చూసి అస్యహించుకునే శాకాహారులు, తాము వేగాన్స్ అని చెప్పుకునే వాళ్లంతా రోజూ తినే చక్కెర ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా చూశారు. అసలు చక్కెర తయారీ విధానం ఏంటో తెలుసా? ఇవన్నీ తెలుసుకుంటే మాత్రం మీరు జన్మలో పంచదార జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయరు.
ఉదయాన్నే లేచిన వెంటనే కాఫీయో టీనో గొంతులో పడకపోతే కొందరికి పొద్దుగడవదు. మరి అలాంటి వారు తాగే టీ, కాఫీల్లో కలుపుకునే చక్కెర గురించి ఎప్పుడైనా ఆలోచించారు. మనం తినే, తాగే పదార్థాలకు షుగర్ ప్రత్యేక రుచిని ఇస్తుంది. అందుకే బెల్లం, తేనె లాంటి సహజమైన తీయని పదార్థాలు ఉన్నప్పటికీ అంతా చక్కెరను ఎక్కువగా ఇష్టపడతుంటారు.
ఈ చక్కెర తింటే శరీరంలో అనవసరైన కేలరీలు పెరిగిపోతాయని, షుగర్ లాంటి వ్యాధులు వస్తాయని చాలా మంది పంచదారను తీసుకోవడం మానేస్తుంటారు. చెరక నుంచే చక్కెర వస్తుందని అందుకే దీన్ని శాకాహారంగానే చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. మీరు రోజూ వాడే చక్కెరలో జంతువుల ఎముకులతో తయారు చేసిన పొడిని కలుపుతారట. వీటి కోసం ప్రత్యేకంగా జంతువులను వధించకపోయినా ఏదో సందర్భంలో చనిపోయిన జంతువుల ఎముకులను సేకరించి వాటిని శుభ్రపరిచి చక్కెర కర్మాగారాలకు తరలిస్తారు.
సర్వసాధారణంగా టేబుల్ షుగర్ చెరకు లేదా దుంపల నుంచి సేకరిస్తారు. ఇవి శాకాహార వస్తువులే అయినా ఆ మిశ్రమాన్ని శుద్ధి చేసిన చక్కెరగా తయారు చేస్తారు. అలా తయారు చేసిన చక్కెర చూడటానికి బాగోదు. అందుకే అందులో తెలుపు, గ్రాన్యులేటెడ్ కోసం నిర్దిష్ట స్థాయి బోన్ చార్ (జంతువుల ఎముకల నుండి తయారైన పౌడర్) కలుపుతారు. తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఇది అమెరికా లాంటి దేశాల్లో సర్వసాధారణం.
రెండో రకం చక్కెరలో టర్బినాడో లేదా డెమెరారా వంటి ముడి చక్కెర ప్రాసెసింగ్‌లో బోన్ చార్‌ని ఉపయోగించరు. ఈ గోలంతా ఎందుకూ అనుకుంటే తేనె, మాపుల్ సిరప్ వంటి మొక్కల ఆధారిత స్వీటెనర్లు అందుబాటులో ఉంటాయి వాడుకోవచ్చు.
చక్కెర ప్యాక్ చేయడానికి ముందు పెద్ద బ్యాచ్‌ల్లో ప్రాసెస్ చేస్తారు. ఆ టైంలోనే తెల్ల చక్కెరలో మొలాసిస్‌ను వేరు చేయడం ద్వారా ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడే బోన్ చార్ ఉపయోగిస్తారు. సంప్రదాయ చక్కెరలో దాదాపు 4% బోన్ చార్‌ని ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. మీరు శాఖాహారులైతే మాత్రం నిర్దిష్ట బ్రాండ్ లేదా చక్కెర రకాన్ని తనిఖీ చేసి ఎంపిక చేసుకుంటే మంచిది.