ప్రస్తుతం చాలామంది లో ఆహారపు అలవాట్లు మారడం వల్ల అధిక బరువు పెరగడం, ఉబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారి జీవన శైలిలో మార్పులు రావడం వలన బెల్లీ ఫ్యాట్, అధిక బరువు పెరుగుతున్నారు. ఇక బరువు తగ్గడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. జిమ్ లు అంటున్నారు.. వ్యాయామాలు అంటున్నారు. ఎన్ని చేసినా మాత్రం బరువు అయితే తగ్గట్లేదు.
గంటల తరబడి జిమ్లలో చెమటోడిస్తున్నారు. మరికొందరైతే భోజనం చేయకుండా కేవలం నీళ్లు తాగే ఉంటున్నారు. అయినా ఫలితం రావట్లేదు. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ప్రోటీన్ పదార్థాలు తీసుకోకపోవడం
చాలామంది తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం వల్లే కండరాల నిర్వహణ చాలా కష్టంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జిమ్ చేసేటప్పుడు తగినంత ప్రోటీన్ శరీరానికి అందాలని చెబుతున్నారు. అలా అందకపోతే అది విపరీతమైన ఆకలిని ప్రేరేపిస్తుందని, అప్పుడు అతిగా తినడం జరుగుతుందని.. దీనివల్ల పరువు పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.
రకరకాల డైట్ ఫాలో అవ్వడం
చాలామంది బరువు తగ్గాలనే కసితో రకరకాల డైట్స్ ఫాలో అవుతారు. కొందరు భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో ఉంటారు. మరి కొందరు వాటర్ మాత్రమే తాగుతూ ఉంటారు. వీటివల్ల క్యాలరీలు తీసుకోవడం మానేస్తున్నారు. అయితే ఇలా కొద్ది రోజులు ప్రభావవంతంగా ఉండొచ్చని ఆ తర్వాత మాత్రం చాలా అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరాన్ని తగిన పోషకాలు అందకా దీర్ఘకాలంలో అనారోగ్యాల బారిన పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందువల్ల ఇలాంటి డైట్ కాకుండా ఆకుకూరలు, గుడ్లు, తృణధాన్యాలు, కూరగాయలు తీసుకోవాలని చెబుతున్నారు…
మంచి నిద్ర
ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్, యోగ ఎంత అవసరమో వాటితో సమానంగానే నిద్ర అనేది చాలా ముఖ్యం. చాలామంది ఇలా ఎక్సర్సైజులు చేసిన తర్వాత తమ పనులకు వెళ్లిపోతారు. ఎంత నిద్ర వచ్చినా ఆపుకుంటారు. దీనివల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య నిపుణులు ఎప్పుడు కూడా మనిషికి మంచి నిద్ర ఉండాలని చెప్తుంటారు. కానీ బిజీ లైఫ్ లో పడి చాలామంది పట్టించుకోరు. తగినంత నిద్ర లేకపోతే బరువు కూడా పెరుగుతారని ఆకలకి సంబంధించిన హార్మోన్లను దెబ్బతీస్తుందని అంటున్నారు. అది అతిగా తినాలని కోరికను ఎక్కువగా పెంచుతుందని చెబుతున్నారు. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి నిద్ర అనేది చాలా అవసరం అని సూచిస్తున్నారు.