వేసవికాలంలో శరీరానికి చలువ చేసే పదార్థాలు చాలా అవసరం. ముఖ్యంగా ఎండల్లో తిరిగేవారు ఈ చలువ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ ఎండకి గురైన వారు వీటిని తీసుకోకపోతే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. ఒక్కోసారి అది వడదెబ్బకు కారణం అవుతుంది. అందువల్ల ఈ సీజన్లో చలువ పానీయాలు ఎక్కువగా తాగాలి. అందులో పుదీనా పానీయం ఒకటి. సాధారణంగా ఈ సీజన్ లో చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు.
కానీ అది ఏమాత్రం మంచిది కాదు. ఇంటి దగ్గరే ఉన్న పదార్థాలతో చక్కటి చలువ చేసే పానీయం చేసుకోవచ్చు. అదే పుదీనా పానీయం. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది బాడీని కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. పుదీనాలో ఎక్కువగా చలువ చేసే గుణాలు ఉన్నాయి. ఇది ఈ వేసవి సీజన్లో శరీరాన్ని చల్లపరుస్తుంది. కాబట్టి బయట ఎండ నుంచి వచ్చిన వారు ఈ డ్రింక్ తాగితే బాడీ హీట్ కంట్రోల్ అవుతుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం.
పుదీనా డ్రింక్ రెసిపీ
ముందుగా కొన్ని పుదీనా ఆకులను శుభ్రం చేసి వాటిని మిక్సీ కొట్టాలి. అందులో కొంత పంచదార వేసి బాగా కలపాలి. ఇక ఆ తర్వాత వాటినీ ఒక గ్లాసులో వేయాలి. అందులో తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే వాటిలో ఐస్ క్యూబ్స్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. దీంతో టేస్టీ పుదీనా డ్రింక్ రెడీ అవుతుంది. ఇలా ఈ పుదీనా డ్రింక్ తాగడం వల్ల డిహైడ్రేషన్కు గురవకుండా ఉంటారు. అంతేకాకుండా ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.