చాలామంది బరువు తగ్గడానికి, బాడీ ఫిట్ గా ఉండడానికి వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తారు. అయితే అలాంటివారు కొన్ని విషయాలు పాటిస్తే వాటితో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా సేఫ్ గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని అంటున్నారు. ఇలా ఫాలో అవ్వడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రేక్ తీసుకోవడం
చాలామంది జాగింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు హార్ట్ బీట్ స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఇది హృదయనాల వ్యవస్థను సవాలు చేయడమే కాకుండా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనికి అనుగుణంగా వాకింగ్ లేదా రన్నింగ్ లో కాస్త బ్రేక్ ఇవ్వాలి. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత కొత్త ఎనర్జీ తోడవుతుంది. అప్పుడు మరింత స్పీడ్ గా రన్నింగ్ చేయొచ్చు. ఇలా బ్రేక్ ఇస్తూ చేయడం వల్ల ఎక్కువ సేపు పరిగెత్తగలుగుతారు. దీని ద్వారా గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
చేతులు ఊపడం
చాలామంది వాకింగ్ చేసేటప్పుడు రోబోల్ల నడుస్తుంటారు. అలా చేయడం కరెక్ట్ కాదని వైద్యులు అంటున్నారు. నడిచేటప్పుడు శరీర భాగంపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు. అలా చేసినప్పుడే గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు. వాకింగ్ చేసేటప్పుడు చేతులును అటు ఇటు ఊపడం వల్ల హార్ట్ బీట్ పెరుగుతుందని.. దానివల్ల క్యాలరీలు బర్న్ అవుతాయని అంటున్నారు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల స్పీడ్ కూడా పెరుగుతుందని అంటున్నారు. దీనివల్ల చేతులు భుజాలు అన్ని బలంగా అవుతాయని సూచిస్తున్నారు.
శ్వాస పై కంట్రోల్
వాకింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు శ్వాసను కంట్రోల్ గా ఉంచుకోవాలి. గట్టిగా శ్వాస తీసుకోకుండా స్లోగా, డీప్ బ్రీత్ తీసుకునేలా ట్రై చేయాలి. ముక్కు ద్వారా గాలి పీల్చుకొని నోటి ద్వారా నెమ్మదిగా వదలాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.