Cancer Symptoms: వీటిని చిన్న లక్షణాలే అనుకుంటాం.. కానీ, క్యాన్సర్‌కు సంకేతాలని తెలుసా?

Image Credit: Pixabay

కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యలు బాగా పెరిగాయి. ఇప్పటికే చాలామంది ఆకస్మిక గుండె పోటుతో చనిపోతున్నారు. చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలతో చనిపోయేవారి సంఖ్య ఘనంగా పెరిగింది. కేవలం గుండె సమస్యలే కాదు. ఇంకా ఎన్నోరకాల వ్యాధులు మనకు తెలియకుండానే మన శరీరంలో ముదురుతున్నాయి. వాటిలో అత్యంత భయానకమైనది క్యాన్సర్. క్యాన్సర్ ముదరడానికి ముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి మనకు సాధారణ సమస్యల్లాగానే కనిపిస్తాయి. కానీ, కాదు.

ఇటీవల ఓ అధ్యయనంలో కొన్ని భయానక విషయాలు తెలిశాయి. అమెరికాలోని చోటుచేసుకుంటున్న అత్యధిక మరణాల్లో.. గుండె జబ్బుల తర్వాత క్యాన్సర్‌తో చనిపోయేవారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కేవలం యూఎస్‌లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఇలాగే ఉంది. కాబట్టి.. మనం ముందుగానే కొన్ని లక్షణాలను తేలిగ్గా తీసుకోకుండా వైద్యులను సంప్రదించి జాగ్రత్త పడటం అవసరం. క్యాన్సర్ అంటే కేవలం మహిళలకే అనుకుంటారు. కానీ, పురుషులు కూడా అప్రమత్తంగా ఉండాలి.

ఎముకల నొప్పి

కొంతమందికి ఎముకలు నొప్పి పుడుతూ ఉంటాయి. మీకు కూడా అలాంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే.. ఇది ఎముకల క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. నొప్పులు, వాపు వంటివి ఏమైనా కనిపిస్తే అప్రమత్తం కావడం మంచిదని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతోంది.

మింగడం కష్టంగా ఉండటం

కొందరు ఆహారం మిగడానికి కష్టపడుతుంటారు. గొంతు నొప్పిగా లేదా పట్టేసినట్లుగా ఉంటుంది. ఇది గొంతు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. అలాగే ఊపిరితీత్తుల క్యాన్సర్‌కు సంబంధించిన మొదటి సంకేతాలలో కూడా ఇది ఒకటి. గొంతు బొంగురుపోవడం, గొంతుపై ఒత్తిడిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ క్యాన్సర్‌ కావచ్చు.

తరచుగా తలనొప్పి

తలనొప్పి సాధారణ సమస్యే. కానీ, అందరికీ కాకపోవచ్చు. ముఖ్యంగా తరచుగా తలనొప్పితో బాధపడుతున్నవారు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే.. అది బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు.

కళ్ల నొప్పులు

కళ్లు లేదా.. కంటి చుట్టూ కలిగే నొప్పి కూడా క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అస్పష్ట దృష్టి లేదా పూర్తిగా చూపు మందగిస్తున్నట్లు అనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

గుండెల్లో మంటగా ఉండటం

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం.. తరచుగా గుండెల్లో మంట వస్తున్నట్లయితే తప్పకుండా మీలో ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లే. లైట్‌గా ఛాతిలో నొప్పి వస్తున్నట్లయితే అది అన్నవాహిక లేదా కడుపు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.

రొమ్ములు ఇలా మారుతున్నా..

మహిళల తమ రొమ్ములను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీ రొమ్ములు ఎరుపు లేదా ఊదా రంగులోకి మారుతున్నా.. అక్కడ వాపు లేదా నొప్పి ఉన్న డాక్టర్‌ను సంప్రదించాలి.

చనుమొనలు మారుతుంటే జర భద్రం

మహిళలూ మీ చనుమొనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వాటిలో చిన్న మార్పు గమనించినా అనుమానించాలి. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు ముందు మహిళల్లో కనిపించే లక్షణం.. చనుమొనల్లో మార్పు. చనుమొనలు ఫ్లాట్‌గా లేదా పక్కకు తిరిగినట్లు కనిపిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాలి.

పీరియడ్స్ సమస్య..

మహిళలు పీరియడ్స్‌లో వచ్చే రక్తస్రావం, నొప్పిని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పకుండా వైద్యులను సంప్రదించి కారణాలు తెలుసుకోవాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి. మహిళల్లో ఏర్పడే బాధకరమైన పీరియల్స్, రక్తస్రావం ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వృషణాల వాపు

అబ్బాయిలు తప్పకుండా తమ వృషణాలను చెక్ చేసుకోవాలి. వాటిలో ఏవైనా మార్పులు కనిపిస్తే అప్రమత్తం కావాలి. వృషణాల వాపు క్యాన్సర్‌ను సూచిస్తాయి. కొందరికి నొప్పి ఏర్పడవచ్చు. లేదా కొందరికి నొప్పి లేకుండానే క్యాన్సర్ రావచ్చు. కాబట్టి, జాగ్రత్త.

విపరీతంగా బరువు తగ్గుతుంటే..

మీరు అకస్మాత్తుగా బరువు తగుతున్నా అనుమానించాలి. మీరు ఎలాంటి వ్యాయమం చేయకున్నా.. విపరీతంగా బరువు తగ్గిపోతున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇది పెద్దపేగు లేదా ఉదర క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

అంగస్తంభన సమస్యలు

అమెరికా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ప్రోస్టేట్ క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు ముందుగా కనిపించేది అంగ స్తంభన సమస్య. కలయిక సమయంలో అంగం గట్టిపకడపోతే.. తప్పకుండా డాక్టర్‌ను కలవండి.

కడుపులో నొప్పి

కడుపు నొప్పిని కూడా చిన్నదిగా భావించకూడదు. తరచుగా కడుపు నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. మలబద్ధకం, అతిసారం కూడా ప్రమాదకరమే. అది కొలోరెక్టర్ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. గ్యాస్ లేదా ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు అండాశయ, పెద్దప్రేగు క్యాన్సర్లకు సంకేతం కావచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్‌ వెల్లడించింది. మూత్ర విసర్జణ కష్టంగా ఉన్నా ప్రమాదమే.

గురక

మీకు గానీ.. మీ కుటుంబికుల్లో ఎవరికైనా అతిగా గురక వస్తుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి. ఊపరితీత్తుల క్యాన్సర్ లక్షణాల్లో గురక కూడా ఒకటి. అలాగే.. అది థైరాయిడ్ క్యాన్సర్‌ లక్షణం కూడా కావచ్చు.

అలసట, జ్వరం

డైలీ ఏడు లేదా 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యకరం. అలా కానట్లయితే తీవ్రంగా అలసిపోతారు. ఒక వేళ మీరు ప్రయత్నించినా నిద్ర రాకపోతున్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ తీవ్రమైన అలసట లకేమియా వంటి క్యాన్సర్లకు సంకేతం కావచ్చు. అధిక ఉష్ణోగ్రతలతో తరచుగా జ్వరం వస్తున్నట్లయితే క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం ఉంది. శరీరం అతిగా వేడెక్కుతే ఎముక మజ్జలో అసాధారణ తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ పోరాట సామర్థ్యాలపై ప్రభావం చూపుతుంది.

వేలుగోళ్ల కింద ఇలా ఉంటే..

మీ వేళ్ల గోళ్ల కింద ఒక గోధుమ లేదా నలుపు గీత లేదా చుక్క ఏర్పడినట్లయితే చర్మ క్యాన్సర్‌గా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌‌ను సంప్రదించాలి..

శరీరంపై దద్దుర్లు

శరీరంపై దద్దర్లు ఏర్పడే అలర్జీ అనుకుంటాం. కానీ, అది మీ అనారోగ్యానికి కూడా సంకేతం కావచ్చు. లుకేమియా అనే రక్త క్యాన్సర్ వల్ల కూడా ఇలా కావచ్చు. శరీరంలో పెరిగే అసాధారణ రక్త కణాలు.. ప్లేట్ లెట్ల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. దానివల్ల చర్మంలోని రక్తనాళాలు పగిలిపోతాయి. ఫలితంగా లుకేమియా ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారి చర్మంపై ఎరుపు లేదా ఉదా గోదుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. వీటిని పెటేచియా అని పిలుస్తారు.

తరవాత కథనం