Beauty Tips: వయసు దేనికీ అడ్డంకి కాదు కానీ వృద్ధాప్యాన్ని మాత్రం అడ్డుకోలేం. వయసు పెరిగే కొద్దీ మన శరీర పనితీరు, రూపరేఖలు సహజంగా మారడం మొదలవుతాయి. 30 ఏళ్ల తర్వాత శరీరంలో మార్పులు మొదలవుతాయి. అందులో మనం అనివార్యంగా కనిపించడం, ముఖంపై ముడతలు వచ్చినట్లు, వయస్సు నుండి జీర్ణ రుగ్మత, శక్తి కోల్పోవడం, అలసట,జుట్టు తెల్లగా రావడం వంటి వివిధ లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాదు ముఖం డల్‌గా కనిపించడం, మొటిమలు, మచ్చలు వంటివి కూడా ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టాలంటే.. ఇలా ట్రై చేయండి. వయసుపైబడిన చాలా యవ్వనంగా కనిపిస్తారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
బీట్ రూట్, రోజ్ వాటర్ ఫేస్ మాస్క్
ముందుగా బీట్ రూట్ మెత్తగా మిక్సీ పట్టి.. రసాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, అలోవెరా జెల్, గ్లైసిన్ టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మం మృదువుగా మారడంతో పాటు.. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
శెనగపిండి, తేనె, పసుపు
చిన్న గిన్నెలో రండు టేబుల్ స్పూన్ శెనగపిండి, తేనె, చిటికెడు పసుపు కలపి ముఖానికి పెట్టుకోండి. అరగంట తర్వాత ఫేస్‌ని వాష్ సాధారణ నీటితో వాష్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ స్కిన్ చాలా కాంతివంతంగా మెరుస్తుంది.
బియ్యం పిండి, బీట్ రూట్ రసం ఫేస్ మాస్క్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ బీట్ రూట్ రసం, అలోవెరా జెల్ కలపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. ముఖం మిలమిల మెరుస్తుంది, స్పూత్‌గా ఉంటుంది.
ముల్తానీ మట్టి, పచ్చిపాలు, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
మందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, టీ స్పూన్ పచ్చిపాలు, రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖం చాలా అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది. మీ అందం చూసి మీరే మురిసిపోతారు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.