White Hair Tips: ప్రస్తుతం రోజుల్లో అనేక అనారోగ్య సమస్యలతో పాటు.. తెల్లజుట్టు సమస్యలతో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మారుతున్న జీనవ శైలి, దుమ్మూ, ధూళి, స్ట్రెస్ ఇతర కారణాలు కావచ్చు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటివల్ల ఫలితం ఉండకపోవచ్చు. కెమికల్స్‌తో ఉన్న ప్రొడక్ట్స్ జుట్టుకు పెట్టుకుంటే.. అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పదార్ధాలతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. జీవితంలో తెల్లజుట్టు సమస్యలు ఉండవు. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సినపదార్ధాలు
కళోంజీ సీడ్స్
మెంతులు
పసుపు
ఆవాలు
లవంగాలు
బాదం పప్పులు
కొబ్బరి నూనె
తయారుచేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కళోంజీ సీడ్స్, మూడు టేబుల్ స్పూన్ మెంతులు, పసుపు మూడు టేబుల్ స్పూన్, ఆవాలు గుప్పెడు, లవంగాలు మూడు, బాదం నాలుగు వేసి బాగా నల్లగా మారేంతవరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని, మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలోకి తీసుకుని.. అందులో కొబ్బరి నూనె కలిపి తలకు అప్లై చేయండి. కనీసం 40 నిమిషాల వరకు ఉంచి తలస్నానం చెయ్యండి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. క్రమంగా తెల్లజుట్టు సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉపయోగించే పదార్ధాలు తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. జుట్టుకు ఎలాంటి హానికలగదు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ చిట్కా ట్రై చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.