Benefits of Peanuts: వేరు శెనగలు అధిక మొత్తంలో విటమిన్లు కలిగి ఉన్నాయి. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో చక్కగా పనిచేస్తాయి. వేరు శెనగలో ఉండే విటమిన్ బి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. పల్లీలు శరీరంలో ఆరోగ్యకరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి. వేరు శెనగలో ఉండే ఫైబర్, ప్రొటీన్లు బరువును తగ్గిస్తాయి. ప్రొటీన్లు ఎక్కువ సమయం పొట్ట నిండినట్లుగా కనపిస్తాయి.
ఫలితంగా ఆహారపదార్ధాలపై ఎక్కువ మగ్గు చూపరు. తద్వారా అనవసరంగా బరువు పెరగరు. ఇందులో ఉండే ఫైబర్లు మలబద్దకాన్ని తగ్గించడమే కాకుండా హృదయ సంబంధిత వ్యాధులను, మధుమేహం వ్యాధి నుండి ఉపశమనం కలిగిస్తాయి. వేరు శెనగ తక్కువ కాలరీలు ఉండటం వల్ల శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు. వీటిలో అధిక మొత్తంలో పోషకాలు కూడా ఉన్నాయి.
వేరు శెనగను తినడం వల్లన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేరుశెనగలను వేయించి లేదా ఉడికించి తీసుకోవచ్చు. వేరుశెనగను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించబడతాయి. ఉప్పు కలిపిన వేరుశెనగలు తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమేనని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు కలలిపిన వేరు శెనగలు తింటే బరువుపెరగడంతో పాటు.. మధుమేహం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వేరుశెనగలో పాలీఫెనాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యవ్వనాన్ని కాపాడటంలో అధ్బుతంగా పనిచేస్తుంది. వృద్ధాప్యంతో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను వేరుశెనగలు నివారించడంలో సహాయపడతాయి. ఎప్పుడూ ఆరోగ్యంగా, అందంగా కనిపించాలనుకుంటే వేరుశెనగలు మీకు మంచి మిత్రులుగా ఉంటాయి. వేరు శెనగలు తింటే ఎముకలు బలంగా మారతాయి.