pineapple tea: పైనాపిల్ టీ బెనిఫిట్స్ భలా.. తెలిస్తే అస్సలు వదలరు!

పైనాపిల్ ఫ్రూట్ గురించి అందరికీ తెలిసిందే. పుల్ల పుల్లగా తీయతీయగా ఉండే ఈ పండ్లు వేసవికాలంలో బాగా దొరుకుతాయి. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు ఎన్నో పోషకాలను కలిగి ఉందని.. అది శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా పైనాపిల్ టీ తో ఎన్నో బెనిఫిట్స్ పొందచ్చని చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఇందులో బ్రోమిలైన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బెటర్ గా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పైనాపిల్ తోలు తో చేసే ఈ టీ తాగడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి.

పైనాపిల్ టీ ప్రయోజనాలు

ఇన్ఫ్లమేషన్ కంట్రోల్

0.23 శాతం బ్రోమేలైన్ అనే ఎంజైమ్ పైనాపిల్ లో ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి వాపు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యల బాధపడే వారికి ఉపయోగపడుతుంది.

అరుగుదల వేగం

ఇందులో ఉండే ప్రోటీలైటిక్ ఎంజాయ్ ప్రోటీన్లను బ్రేక్ అవ్వకుండా చేస్తుంది. ఇవి అరుగుదలను వేగవంతం చేస్తాయి. దీని ద్వారా ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు ఉపశమనం కల్పిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పేగులను కాపాడతాయి.

రోగ నిరోధక శక్తి

పైనాపిల్ తోలులో అధికంగా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.

చర్మానికి మేలు

పైనాపిల్ టీ తాగడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది ముఖంపై వచ్చే వృద్ధాప్య లక్షణాలను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

తరవాత కథనం