Pumpkin Face Mask: ఈ ఫేస్ మాస్క్ ఒక్కసారి వాడినా చాలు, చందమామ లాంటి ముఖం

Pumpkin Face Mask

Pumpkin Face Mask: వాతావరణం మారుతోంది. దీని కారణంగా ముక్కు, బుగ్గలు, నుదిటిపై అదనపు నూనె పేరుకుపోవడం సర్వసాధారణం. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది మహిళలు వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ వీని వల్ల చర్మంపై వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇదిలా ఉంటే ఆరోగ్యానికి మేలు చేసే.. గుమ్మడికాయ చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

గుమ్మడి కాయ గుజ్జు జిడ్డు ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మం యొక్క నీరసాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొడి చర్మ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాయి. దీంతో పాటు.. ఇందులో ఉండే ఎంజైమ్‌లు నిస్తేజంగా ఉన్న చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. గుమ్మడికాయలో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఇవి ఎండ కారణంగా వచ్చే మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. ఇది జిడ్డు చర్మం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అందుకే.. ఈ రోజు మనం ఇంట్లోనే గుమ్మడికాయతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసి వాడాలనే విషయాలను గురించి తెలుసుకుందాం.

గుమ్మడి కాయతో ఫేస్ మాస్క్ :
1. గుమ్మడికాయ, అవకాడో నూనె, ఓట్ మీల్ :

గుమ్మడికాయ పేస్ట్- 1 టేబుల్ స్పూన్
అవకాడో పేస్ట్- 1 టేబుల్ స్పూన్
ఓట్ మీల్- 1 టీ స్పూన్

తయారీ విధానం:
ముందుగా ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి.. గుమ్మడికాయను మెత్తగా చేసుకోవాలి. తర్వాత అవకాడో ఆయిల్ , ఓట్ మీల్ వేసి బాగా కలపాలి. ఈ ఫేస్ మాస్క్‌ను ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఈ మాస్క్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, మచ్చలను తొలగించడంలో చాలా సహాయపడుతుంది.

2. గుమ్మడికాయ, అలోవెరా జెల్, విటమిన్ ఇ :

గుమ్మడికాయ గుజ్జు- 1 టేబుల్ స్పూన్
అలోవెరా జెల్- 1 టేబుల్ స్పూన్
విటమిన్ ఇ క్యాప్యూల్స్ – 1

ఈ హోంమేడ్ ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడానికి.. ముందుగా గుమ్మడికాయ గుజ్జులో కలబంద జెల్ , విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మాస్క్ ని ముఖం, మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత.. ముఖాన్ని మసాజ్ చేసి నీటితో వాష్ చేయండి. ఈ ఫేస్ మాస్క్ వాడటం వల్ల చర్మం అందంగా మారుతుంది. అంతే కాకుండా ఇది ఫైన్ లైన్స్ నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. ఈ ఫేస్ మాస్క్ అప్లై చేయడం వల్ల ముడతలు కూడా తొలగిపోతాయి.

3. గుమ్మడికాయ, తేనె, పెరుగు:
గుమ్మడికాయ గుజ్జు- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్
పెరుగు- 1 టీ స్పూన్

తయారీ విధానం:
ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి.. ముందుగా గుమ్మడికాయ ముక్కలను నీటిలో ఉడికించాలి. తర్వాత చల్లబరిచి.. చెంచా సహాయంతో మెత్తగా చేయాలి. ఇప్పుడు 2 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ తేనె వేసి బాగా కలపండి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి సరిగ్గా అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత.. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.

4. చియా విత్తనాలు, శనగపిండి, గుమ్మడికాయ:
గుమ్మడి కాయ- 1 టేబుల్ స్పూన్
శనగపిండి- 2 టేబుల్ స్పూన్లు
చియా సీడ్స్- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:
2 టీస్పూన్ల చియా విత్తనాలను రాత్రంతా నానబెట్టండి. ఇప్పుడు నానబెట్టిన చియా సీడ్స్, గుమ్మడికాయ పేస్ట్ బాగా కలపండి. తర్వాత ఇందులోనే శనగపిండిని వేయండి. ఈ పేస్ట్ ని ముఖం, మెడ మీద బాగా అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేయండి. ఈ ఫేస్ మాస్క్‌ను క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల చర్మ రంగు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఈ ఫేస్ మాస్క్ మీ చర్మం రంగు, ఆకృతిని మెరుగు పరచడంలో కూడా సహాయపడుతుంది.

 

తరవాత కథనం