గుమ్మడి కాయను ఈ రోజుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. గుమ్మడి కాయ వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ వంటకాల్లో గుమ్మడి కాయకు గొప్ప స్థానం ఉంది. వీటిలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుమ్మడి గింజల్లో వివిధ రకాల యాంటీ ఆక్సీడెంట్లు, కాల్షియం, ఐరన్, ప్రొటీన్స్, ఫాస్పరస్, విటమిన్ ఎ, బీ1 వంటి ప్రధానమైన విటమిన్స్ పుష్కలంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పీచు, విటమిన్ సి, గుండెకు రక్త ప్రసరణ అందేలా సహాయం చేస్తాయి. అంతేకాదు మూత్రపిండాల్లో విటమిన్స్, మినరల్స్, అధికంగా ఉండటం వల్ల మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో పాటు కిడ్నీ స్టోన్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. వైద్యుల సలహా ప్రకారం తీసుకుంటే మరింత మంచిది.
గుమ్మడి గింజల్ని ప్రతిరోజు తినడం వల్ల.. వీటిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఎ, శరీరంలోని బీటా కెరోటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యతను కాపాడుతుంది. విటమిన్ సి, శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. గుమ్మడి గింజలు శరీరంలోని హార్మోన్లు విడుదల చేయడంతో.. ఒత్తిడి తగ్గి అలసట దూరం అవుతుంది. హాయిగా నిద్ర పడుతుంది.
గుమ్మడి గింజలను చాలా మంది సరిగ్గా తీసుకోరు. ఇందులో జింక్, విటమిన్ సి, అధికంగా ఉండటం వల్ల కాలిన గాయాలకు మందులా పనిచేస్తుంది. గుమ్మడి కాయ ప్రొస్టేట్ గ్రంధితో బాధపడేవారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో ఎక్కువగా లభించే బీటా కెరోటిన్ శరీరానికి తక్కవ కాలరీలను అందిస్తుంది. కంటి చూపు మెరుగుపడటానికి దోహదం చేస్తాయి. గుమ్మడి పండునే కాకుండా వాటి పువ్వులు, ఆకులు, కాండాలను కూడా వంటకాల్లో ఉపయోగిస్తుంటారు.
గుమ్మడి గింజల్ని ప్రతిరోజు డైట్‌లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు, డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అధిక బరువు, జీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లైతే.. ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ గుమ్మడి గింజల్ని తినండి. మంచి ఫలితం ఉంటుంది. అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. గుమ్మడి గింజలతో మూత్రనాళ సమస్యలన్నీ దూరం అవుతాయి.