చాలామంది తమ చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఏవేవో కెమికల్ ప్రొడెక్ట్స్ వాడుతుంటారు. లేదా బ్యూటీ పార్లర్ కు వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు కూడా అందమైన చర్మం కోసం కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా?. అయితే వెంటనే వాటిని ఆపేసి నేచురల్ ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి. నాచురల్ ఫేస్ ప్యాక్ ద్వారా మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా చేసుకోవచ్చు.
అందుకోసం సపోటా ఫ్రూట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల దీనిని బ్యూటీ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల స్కిన్ నేచురల్ కాంతిని పొందుతుంది. ముఖంపై మొటిమలు, ముడతలు తగ్గుతాయి. సపోటాతో ఎలాంటి ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సపోటా, తేనె
బాగా పండిన సపోటా గుజ్జులో తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా మాస్క్ ట్రై చేయడం వల్ల ఫేస్ హైడ్రేటుగా ఉండి న్యాచురల్ మెరుపును అందిస్తుంది.
సపోటా ఓట్ మీల్స్
బాగా పండిన సపోటా గుజ్జును తీసి.. దానిని ఓట్ మీల్స్ తో కలపాలి. ఆ తర్వాత దానిని మెల్లిమెల్లిగా చర్మంపై రుద్దుతూ అప్లై చేయాలి. అలా ముఖంపై 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, అందంగా కనిపిస్తుంది.
సపోటా, చక్కర
మెత్తగా పండిన సపోటాలో చక్కెర కలిపి స్క్రబ్ గా చేయాలి. ఆ తర్వాత దానిని ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపు ఉంచిన తర్వాత దానిని కడిగేయాలి. ఇలా చేశారంటే చర్మం పై ఉన్న మృత కణాలన్నీ తొలగిపోయి స్కిన్ యవ్వనంగా, అందంగా కనిపిస్తుంది.