ఐరిష్ నాచు గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఐరిష్ నాచు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిని ‘సముద్రపు నాచు’ అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నుండి ఐరిష్ నాచు చర్మ సంరక్షణ కోసం ఉపయోగించబడుతుంది.
ఇది చాలా రకాల కలర్‌లలో అందుబాటులో ఉంది. దీన్ని చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అదే సమయంలో చర్మం మిలమిల మెరుస్తూ ఉంటుంది. సముద్రపు నాచును ‘నాచురల్ స్కిన్ కేేర్ ప్రొడెక్ట్’ గా పిలుస్తారు. ఇది చర్మాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇతర ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం?
ముడతలను తగ్గిస్తుంది
ఇందులోని విటమిన్ A, C, E వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇది ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఐరిష్ నాచు కొల్లాజెన్‌ను కూడా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ఐరిష్ నాచు ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
స్కిన్ టోన్ మెరుగుపడుతుంది
సముద్రపు నాచు(Sea moss)ను ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ చాలా స్మూత్‌గా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. డార్క్ స్పాట్స్, హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా స్కిన్ చాలా నీట్‌గా, మెరుస్తూ ఉంటుంది. ఇది ఎక్స్‌ఫోలియంట్‌గా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా దీని వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
మొటిమలను తగ్గిస్తుంది
ఐరిష్ నాచు.. జింక్, సెలీనియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి గాయాన్ని నయం చేయడంలో ఉపయోగపడతాయి. అలాగే మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఐరిష్ నాచులోని కొన్ని యాంటీమైక్రోబయాల్స్ ఉంటాయి. అవి చర్మాన్ని అనేక రకాల సమస్యల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి
ఐరిష్ నాచు పొడిని వేడి నీటిలో బాగా కలపాలి.
తరువాత ఆ పేస్ట్‌ని చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి.
చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి.
అలా 5 నిమిషాలు ఉంచాలి.
దీని తర్వాత నీటితో కడగాలి.
గమనిక: ఇది కేవలం ఇతర సైట్ల నుంచి తీసుకున్న సమాచారం మాత్రమే. ఇలా చేసేముందు ఒకసారి వైద్యులను సంప్రదించాలి.