ప్రతి ఒక్కరూ చాలా అందంగా, చాలా క్యూట్ గా ఉండాలని అనుకుంటారు. మిల మిల మెరిసే చర్మం, నిగనిగలాడే పొడవాటి జుట్టు కోసం ఎంతో ప్రయత్నిస్తారు. దీనికోసం రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ లు వాడుతారు. అక్కడితో ఆగకుండా బ్యూటీ పార్లర్ అంటూ ఎగబడతారు. కానీ ముఖంలో మాత్రం అందం ఉట్టి పడదు. మరింత దరిద్రంగా తయారవుతుంది. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఏది పడితే అది వాడితే చర్మం మెరుగ్గా అవ్వదని అంటున్నారు. అయితే చర్మాన్ని అందంగా ఉంచడంలో కొల్లజన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో కొల్లజన్ లేకపోతే చర్మం ముడతలుగా, చర్మం పై మొటిమలు, వంటివి వస్తాయి. కొల్లజాన్ అంటే మరింకేదో కాదు.. అదొక ముఖ్యమైన ప్రోటీన్. ఇది శరీరంలోని ఎముకలను బలంగా ఉంచుతుంది. చర్మాన్ని అందంగా చేస్తుంది. జుట్టును మృదువుగా ఉంచుతుంది.
కండరాలను దృఢంగా మలుస్తుంది. శరీరంలో ఇది లేనప్పుడు ఎముకలు బలహీనంగా మారుతాయి. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు శరీరం అందంగా ఉండదు. జుట్టు మృదువుగా అనిపించదు. మొటిమలు ఏర్పడతాయి. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొళ్ళజాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్
చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలు తింటే శరీరంలో కొల్లజాన్ దెబ్బతింటుంది. ఎక్కువగా స్వీట్లు లేదా తీపి ఉన్న వస్తువులు రక్త ప్రవాహంలో కోల్లాజన్ ఫైబర్తో కలిసిపోతాయి. దీంతో చర్మం లోని కల్లజన్ క్రమంగా తగ్గిపోతుంది. దీని కారణంగా చర్మం ముడతలుగా మారడం, మొటిమలు ఏర్పడడం జరుగుతుంది.
మసాలా పదార్థాలు
తీపి వస్తువులతో పాటు మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్న శరీరంలో కొల్లజన్ లోపిస్తుంది. దీని కారణంగా ముఖంపై ముడతలు వస్తాయి. అందువల్ల మసాలా ఆహారాన్ని తగ్గిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ సి లోపం
విటమిన్ సి లోపం వల్ల కూడా కొల్ల జాన్ లోపం ఏర్పడుతుంది. విటమిన్ సి తక్కువగా ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య బారిన పడతారు.