Ram Navami 2025: శ్రీరామ నవమి ఎప్పుడు జరుపుకుంటారు?.. తేదీ, ముహూర్తం వివరాలు ఇవే!

ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముని జన్మదినోత్సవాన్ని గుర్తుచేస్తుంది. ఈ రోజున భక్తులు భజన పాటలు, ఊరేగింపులు, మంత్రోచ్ఛారణలతో సందడి సందడిగా వేడుకను జరుపపుకుంటారు. అయితే మరి ఈ పవిత్రమైన హిందూ పండుగ తేదీ, శుభ ముహూర్తం, పూజ ఆచారాలు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

రామ నవమి 2025 తేదీ

ప్రతి సంవత్సరం రాముని భక్తులు.. శ్రీ రామ నవమి వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. రాముడు చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి తిథిలో జన్మించాడు. ఆయన మధ్యాహ్న సమయంలో జన్మించాడు. అంటే రోజు మధ్యలో. దీని ఫలితంగా.. ప్రతి సంవత్సరం రామ నవమి తేదీల సమయాలు నిర్ణయిస్తాయి. ఈ సంవత్సరం రామ నవమి ఏప్రిల్ 6న జరుగుతుంది.

రామ నవమి 2025 శుభ ముహూర్తం

ద్రక్ పంచాంగం ప్రకారం.. నవమి తిథి ఏప్రిల్ 5, 2025న సాయంత్రం 07:26 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 6, 2025న రాత్రి 07:22 గంటలకు ముగుస్తుంది. రామ నవమి మధ్యాహ్న ముహూర్తం.. ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:39 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్న ముహూర్తం రామ నవమి ఆచారాలు నిర్వహించడానికి.. రాముడికి పూజ చేయడానికి అత్యంత పవిత్రమైన సమయంగా భక్తులు భావిస్తారు.

రామనవమి 2025 ఆచారాలు

రామనవమి వేడుకలు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి జన్మస్థలం వద్ద ప్రారంభమై దేశవ్యాప్తంగా కొనసాగుతాయి. రామ భక్తులు సరయు నదిలో పవిత్ర స్నానం చేయడం ద్వారా రోజును ప్రారంభిస్తారు. తరువాత ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. వారు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి అలంకరించబడిన విగ్రహాలను మోసుకెళ్లి వీధుల గుండా భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. అదే సమయంలో భక్తులు పెద్ద ఎత్తున భజనలు, రామాయణ పారాయణాలు, పూజలు, హవనాలు అన్నీ దేవాలయాలలో నిర్వహిస్తారు.

తరవాత కథనం