summer hairfall control tips: సమ్మర్‌లో జుట్టు రాలడాన్ని ఇలా తగ్గించేయండి.. వేరీ సింపుల్!

వేసవి వేడి పెరిగిపోయింది. ఎంత తీవ్రత మరింత అధికంగా మారింది. ఉక్కపోత కారణంగా చెమట, తలపై చికాకు, తలపై జిడ్డు పెరగడం జరుగుతుంది. చెమట కారణంగా జుట్టుపై సొండ్రు (పొట్టు) పెరిగే అవకాశం చాలా ఉంది. అందువల్ల అలాంటి సమస్యలకు కారణాలు.. అలాగే దానిని నివారించే మార్గాలను వైద్యులు చెబుతున్నారు.

కారణాలు

సెబమ్ ఉత్పత్తి

ఉష్ణోగ్రత, తేమ రెండింటిలోనూ పెరుగుదల సేబాషియస్ గ్రంథులలో హైపర్యాక్టివిటీకి దారితీస్తుంది. ఫలితంగా తలపై జిడ్డు పెరుగుతుంది.

చెమట, ఉత్పత్తులు

జుట్టు, స్కిన్ కేర్ ఉత్పత్తులు రెండూ చెమటతో కలిసి జిడ్డుగా ఏర్పడతాయి. ఇది తలపై చికాకుకు దారితీస్తుంది.

తరచుగా కడగడం

తలపై చిరాకు ఎక్కువగా ఉంటే.. జుట్టును కడగాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల.. తలపై ఉండే నూనె మాయం  అవుతుంది. దీని ఫలితంగా చర్మం పొడిబారి.. దురద ఏర్పడి అది పొరలుగా మారుతుంది.

చుండ్రుకు చెక్ పెట్టే మార్గాలు

మైల్డ్ షాంపూ

తలస్నానం చేసేటప్పుడు లైట్, సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు యాంటీ-చుండ్రు షాంపూను ఉపయోగించడం వల్ల జుట్టు ఎక్కువగా ఆరబెట్టకుండా తలస్నాన పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.

వారానికి రెండు లేదా మూడుసార్లు

తలస్నానం ఎప్పుడో నెలకి లేేేదా రెండు మూడు వారాలకు ఒకసారి చేస్తే.. చుండ్రు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే తల జిడ్డుగా తయారవుతుంది. అందువల్ల మీరు వారానికి రెండు నుండి మూడు సార్లు జుట్టు కడుక్కోవడం చేయాలి.

పోషకాహారం

విటమిన్లు సి, ఇ, ఎ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఎక్కువగా నీరు త్రాగడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం తగ్గుతుంది.

ఒత్తిడి నియంత్రణ

ఒత్తిడిని నియంత్రించడం చాలా ముఖ్యం. ఒత్తిడి చుండ్రు పెరుగుదలతో పాటు నూనె ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. వ్యాయామం, ధ్యానం లేదా విశ్రాంతి దీనికి సహాయపడతాయి.

తరవాత కథనం