Benefits of Custard Apple: కస్టర్డ్ ఆపిల్‌గా పిలిచే సీతాఫలం కొన్ని కాలాల్లో లభించే అరుదైన పండు. ఎక్కువ విత్తనాలతో.. లోపల తెల్లని రుచికరమైన గుజ్జుతో అందరినీ ఆకర్షించే ఈ పండు వల్ల.. కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి అని భ్రమ పడుతూ ఉంటారు. నిజానికి సీతా ఫలం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సీతా ఫలంలో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. తిన్న వెంటనే శక్తిని ఇచ్చే పండు సీతాఫలం. కండరాలకు బలాన్ని ఇస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు, కాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు వీటికి ఉంటుంది. లివర్ క్యాన్సర్, మెదడులో ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేసే గుణం సీతాఫలానికి ఉంది. ఈ పండ్లలో బీ6 విటమిన్ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్ రాకుండా చేయడంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
దంతాలకు మంచి ఆహారం. దంతాల్లో నొప్పిని నివారిస్తుంది. ఐరన్ అధికంగా ఉండే సీతాఫలం తినడం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సీతా ఫలం తినడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. గుండెకు మంచిది. డయాబెటిస్‌ను దరిచేరనివ్వదు. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. చర్మ, వెంట్రుకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. సీతా ఫలం తియ్యగా ఉంటుంది. కాబట్టి సి విటమిన్‌కి చోటెక్కడ అనుకుంటాం. కానీ ఇందులో యాంటీ ఆక్సీడెంట్లుగా పనిచేసే పొటాషియం, ఎ, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
మిగతా పండ్లతో పోలిస్తే కాలరీలు కాస్త ఎక్కువే.100 గ్రా.. పండు నుంచి 100 క్యాలరీలు లభ్యమవుతాయి. కానీ అవి సహజ చక్కెరలు కావడంతో అవి మేలు చేస్తాయి. బలహీన గుండె, రక్తప్రసార లోపం, ఒత్తిడి, కండరాల బలహీనత, అధిక బీపీలతో బాధపడేవాళ్లకి ఇది ఎంతో మంచిది. సీతా ఫలం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా డిప్రెషన్‌కి మందులా పనిచేస్తుంది. సాధారణం ప్రతి వ్యక్తికి రోజుకి 900 మై.గ్రా కాపర్ అవసరం. ఇందులో పుష్కలంగా ఉంటుంది. గర్భిణీలు ఆహారంగా చేర్చుకుంటే చాలా మంచిది.