Walking Barefoot: చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదేనా..?

Walking Barefoot

Walking Barefoot: చెప్పులు లేకుండా నడవడం మంచిదేనా? లేదా ఏదైనా నష్టం వస్తుందా..? ఇది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నడవడానికి శుభ్రమైన స్థలాన్ని ఎంచుకుని చెప్పులు లేకుండా నడిస్తే.. ఆరోగ్యానికి మంచిది. నేలకు పాదాలు నేరుగా తాగడం వల్ల పాదాలకు విశ్రాంతి కలుగుతుంది. గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు ఇది మేలు చేస్తుంది. నడుము నొప్పి, అరికాల ఫాసిటిస్‌ని నివారించడంలో చెప్పులు లేకుండా సహాయపడుతుంది.

శరీరంలో సహజమైన విద్యుత్ సమతుల్యతను పునరుద్దించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. భూమి ఉపరితలంతో శరీరానికి అనుసంధానం చెయ్యడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మెరుగైన నిద్ర వస్తుందని, ఒత్తిడిని తగ్గించి, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలలో ఉండే నరాలు యాక్టివ్‌గా మారతాయని నిపుణులు చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల మోకాలు, తుంటిపై ఒత్తిడి తగ్గించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు చెప్పుల లేకుండా నడవడం వల్ల కండరాలను బలపరుస్తుందని, పాదాలు వంకర్లు లేకుండా కాపాడుతుందట.

శారీరక, మానసిక, మార్పులను, నిద్ర, శరీర ఉష్ణోగ్రతలు కాపాడుతుందని చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవడం మీ శరీర సహజ కదలికకు సహాయపడుతుంది. చెప్పులు లేకుండా నడవడం ప్రకృతితో మమేకం అవ్వడానికి సహాయపడుతుంది. ఒకటే సారి కఠినమైన నేలపై నడవడం అంత ఈజీ కాదు కాబట్టి మొదట మెత్తని గడ్డిపై నడవడం ప్రారంభించండి.

ఆ తర్వాత నడవాలి అనుకున్న నేలను కాస్త చదునుగా ఉండేలా చూసుకుని మొదలు పెట్టాలి. ప్రతిరోజు చెప్పులు లేకుండా నడవడానికి గంట సమయం కేటాయించాలి. ఆపై ఆ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. కాబట్టి పాదరక్షలు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి రక్ష అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

చెప్పులు లేకుండా నడవడం మంచిదే అయినప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉండొచ్చు. కఠినమైన ఉపరితలాలపై వేడి, పదునైన వస్తువులపై నడవడం వల్ల గాయాలు జరుగవచ్చు. అలాగే ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. శరీరం అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు. మొదట్లో నొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు.

తరవాత కథనం