Summer Health Tips: సమ్మర్‌ వేడి గాలులకు కళ్లు మటాష్.. ఇలా రక్షించుకోండి!

దేశంలోని వివిధ ప్రాంతాలలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రాబోయే రెండు వారాల పాటు వేడిగాలులు వీస్తాయని అంచనా వేసింది. శుక్రవారం దేశ రాజధానిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, తేలికపాటి వర్షాలు కురిశాయి.

అలాగే ఏప్రిల్ 15 నుండి పంజాబ్, ఢిల్లీ, హర్యానాలో నెల మొత్తం అనేక ఇతర ఉత్తర భారత రాష్ట్రాలలో వేడిగాలుల హెచ్చరికలను IMD జారీ చేసింది. తీవ్రమైన వేడి పరిస్థితులు శరీర ఆరోగ్యంతో పాటు కంటి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల తరచుగా అతినీలలోహిత (UV) వికిరణం పెరుగుతుంది, ఇది అనేక కంటి సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల డ్రై ఐ సిండ్రోమ్ అంటే వేడి, తక్కువ తేమ కన్నీళ్లు త్వరగా ఆవిరైపోతాయి. దీని కారణంగా కళ్ళు చికాకుగా, ఎర్రగా, అసౌకర్యంగా ఉంటాయి.

కొంతమందికి కళ్ళలో మంట, అస్పష్టమైన దృష్టి లేదా కళ్ళలో జిగట అనుభూతి కూడా ఉండవచ్చు. UV కిరణాలు.. ముఖ్యంగా తీవ్రమైన సూర్యకాంతిలో కార్నియాను దెబ్బతీస్తాయి. ఫోటోకెరాటైటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీనివల్ల కళ్లు నొప్పి, తాత్కాలిక దృష్టి లోపానికి దారితీస్తుంది. UV రేడియేషన్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత పెరుగుతుంది. దీని వల్ల కాల క్రమేనా దృష్టిలోపం ఏర్పడుతుంది.

అయితే వేడి గాలుల సమయంలో మీ కళ్ళను రక్షించుకోవడానికి ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి.

హానికరమైన UV  కిరణాల నుండి మీ కళ్ళను రక్షించడానికి 100% UVA, UVB కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్‌ను ఎంచుకోండి.

పుష్కలంగా నీరు తాగడం ఆరోగ్యకరమైన కన్నీటి ఉత్పత్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే కళ్ళు పొడిగా, చికాకుగా ఉండకుండా చేస్తుంది.

గరిష్ట సూర్యకాంతి సమయాల్లో (ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు) ఇంటి లోపల ఉండండి. లేదా బయట ఉన్నప్పుడు అదనపు రక్షణ కోసం టోపీని ధరించండి.

ఫ్యాన్లు లేదా ఎయిర్ వెంట్‌ల ముందు కూర్చోవడం మానుకోవాలి. ఎందుకంటే అక్కడ గాలి ప్రవాహం మీ కళ్ళు ఎండిపోయేలా చేస్తుంది.

తరవాత కథనం