Tomato Face Packs: ఎండాకాలం వచ్చేసింది.. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యంతో పాటు.. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్లడం వల్ల చర్మం కమిలిపోతుంది. దీంతో పాటు ట్యాన్ కూడా ఏర్పడుతుంది. దీని వల్ల ముఖంపై కాంతి తగ్గిపోవడం, డల్‌గా కనిపిస్తుంది. అంతే కాదు బయట దుమ్మూ, ధూళి, కాలుష్యం వల్ల చర్మ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇందుకోసం చాలా మంది వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి టమాటాతో వీటిని కలిపి ట్రే చేశారంటే ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టొచ్చు.
చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి , రీఫ్రెష్ చేయడానికి టమాటా అద్భుతంగా పనిచేస్తుంది. టమోటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో చక్కగా పనిచేస్తుంది.
శెనగపిండి, టమోటా ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ శెనగపిండిలో చిన్న టమోటా గుజ్జు తీసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. ముఖం తాజాగా కనిపిస్తుంది.
ముల్తానీ మట్టి, టమోటా గుజ్జు ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, రెండు టేబుల్ స్పూన్ టమోటా గుజ్జు తీసుకుని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ఓపెన్ పోర్స్ సమస్య తొలగిపోతుంది.
పెరుగు, టమోటా గుజ్జు ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని అందులో టమోటా గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ట్యాన్ తొలగిపోతుంది.
టమోటా, చక్కెరతో ఫేస్ ప్యాక్
టమోటాపై చక్కెర కలిపి ముఖంపై ఐదు నిమిషాలు మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. ముఖంపై మురికి తొలగిపోతుంది.