సాధారణంగా నోటి దుర్వాసన పోవడానికి రోజు బ్రష్ చేస్తాం. కానీ కొందరు మాత్రం ఒకే బ్రష్ ను నెలలు తరబడి వాడుతుంటారు. బ్రష్ పై ఉన్న ముళ్ల గరికలు ఇవి విరిగిపోయిన, మెత్తబడిపోయిన దాన్ని వదలకుండా అలానే బ్రష్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మరింత అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన శారీరక మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. నోటి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే జ్వరం, జలుబు, దగ్గు సహా మరే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా ముందుగా నోటికి తెలుస్తుంది. అందువల్ల నోటి ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
తరచూ టూత్ బ్రషింగ్
మనం ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ క్రమం తప్పకుండా టూత్ బ్రష్ చేయాలి. అంతేకాకుండా దానికి సరైన టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి. బ్రష్ చేసిన తర్వాత దానిని శుభ్రంగా కడిగి ఉంచాలి. అయితే చాలామంది నెలల తరబడి బ్రష్ లు వాడుతుండడం మంచి పద్ధతి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దానివల్ల ఆరోగ్యం తీవ్రంగా మారవచ్చు అని అంటున్నారు.
టూత్ బ్రష్ ఎప్పుడు మార్చాలి
సాధారణంగా కొన్నిసార్లు టూత్ బ్రష్ వంకరగా మారుతుంది లేదా బ్రిస్టల్స్ వదులుగా అవుతుంటాయి. అందువల్ల ఇలా జరిగినప్పుడు బ్రష్ మార్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ముళ్ల గరికలు విరిగిపోతే
బ్రష్ పై ఉన్న ముళ్ల గరికలు విరిగిపోతే వెంటనే ఆ బ్రష్ ను మార్చడానికి ట్రై చేయండి. లేదంటే దంతాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ముళ్ల గరికలు దంతాలను శుభ్రం చేయలేవు. అంతేకాకుండా అలా చేస్తున్నప్పుడు నొప్పిని కలిగిస్తాయి.
బలంగా బ్రష్ చేయడం
చాలామంది బ్రెస్‌ను పట్టుకొని గట్టిగా పళ్ళను తోముతారు. దానివల్ల బ్రష్ బ్రిస్టల్స్ ను త్వరగా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా ఇలా జరగడం వల్ల దంతాలు తీవ్ర నొప్పికి గురవుతాయి.
ఆరోగ్య సమస్యలు ఉంటే
మీరు తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇలాంటి విధమైన బ్రష్ చేయడం వల్ల మరింత అనారోగ్యానికి గురవుతారు. దానివల్ల బ్యాక్టీరియా ఎక్కువ పెరగడంతో సతమతమవుతారు. అలాంటి టైం లో కొత్త బ్రష్ చేయడం మంచిది.
ఎన్ని నెలలకు బ్రష్ మార్చాలి
మీరు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని 3 నుండి 5 నెలలకోసారి మార్చాలి