Skin Care Tips: పసుపుతో అందమైన సౌందర్యం మీ సొంతం.. మొటిమలు, మచ్చలకు చెక్ పెట్టేయండిలా?

ప్రస్తుత కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రోడ్లపై ప్రయాణిస్తున్న చాలామంది ముఖం రకరకాల మార్పులకు గురవుతుంది. చాలా అందంగా, నిగారింపు సౌందర్యంతో ఉన్న పురుషులు లేదా స్త్రీల ముఖ కాంతి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో చాలామంది కెమికల్ ప్రొడక్ట్స్ వాడి తమ అందాన్ని మరింత పోగొట్టుకుంటున్నారు.

అలాంటి వాళ్ళు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న పసుపు తోనే మీ అందాన్ని మళ్లీ తిరిగి పొందొచ్చు. ఖరీదైన కాస్మోటిక్స్ కొని డబ్బులు వేస్ట్ చేసే బదులు ఇంటి వంట గదిలో దొరికే పదార్థాలను ఉపయోగించి మీ ముఖ సౌందర్యాన్ని తిరిగి పొందొచ్చు. పసుపులో ఎలాంటి కెమికల్స్ ఉండవు.

ఇదే ముఖానికి అందం ఇచ్చే బెస్ట్ ఆప్షన్. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లోమేటరీ వంటి గుణాలు ఇందులో ఉన్నాయి. ఇవి మచ్చలు, మొటిమలను తగ్గించి ముఖానికి అందాన్ని ఇస్తుంది. అయితే పసుపును చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కొన్ని ప్యాక్ లు ఉన్నాయి.

పసుపు, లెమన్ ప్యాక్

పసుపును, నిమ్మ రసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల అది చర్మం మెరుపును పెంచుతుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అందువల్ల మీరు స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యం పెరుగుతుంది.

పసుపు, తేనె ప్యాక్

పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. దీని కారణంగా మొటిమలు తగ్గుతాయి. అందువల్ల మీరు ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. దానిని ముఖాంపై అప్లై చేయాలి. అలా పది నుంచి 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి.

పసుపు, పెరుగు

పసుపు పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ఇది చర్మాన్ని క్షేమంగా ఉంచి ముఖ కాంతిని పెంచుతుంది. దీనికోసం మీరు టేబుల్స్పూన్ పెరుగులో టీ స్పూన్ పసుపు మిక్స్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ముఖంపై అప్లై చేయాలి. అలా పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మం పై ఆయిల్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

తరవాత కథనం