Ugadi 2025: ఈ ఏడాది ఉగాది ఏ రోజున పడింది.. ఏ సమయంలో జరుపుకోవాలో తెలుసుకోండి!

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను అత్యంత అంగరంగ వైభవంగ జరుపుకుంటారు. ఉగాది అనేది ఎంతో ఆనందం, ఉత్సాహంతో జరుపుకునే ఒక పండుగ. ఆ రోజున కుటుంబం, స్నేహితులు కలిసి బయటకు వెళ్తారు. నూతన సంవత్సరం రోజున  ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు. అలాగే, ఈ రోజున ‘ఉగాది పచ్చడి’ అనే ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. దీనిని పచ్చి మామిడికాయ, వేప, బెల్లం, చింతపండు, కారం, ఉప్పుతో కలిపి తయారు చేస్తారు. తింటుంటే పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా, కాస్త చేదుగా, ఇంకాస్త వగరుగా, తినగా తినగా ఉప్పుగా ఉంటుంది.

లూని-సోలర్ క్యాలెండర్ ప్రకారం.. ఉగాది నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రజలు జరుపుకుంటారు. దీనిని యుగాది అని కూడా పిలుస్తారు. ఇది  సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉగాదిని మరాఠీ నూతన సంవత్సరం అయిన గుడి పద్వా రోజున జరుపుకుంటారు.

హిందూ నూతన సంవత్సరాన్ని.. సంవత్సరంలో రెండుసార్లు వేర్వేరు పేర్లతో, సంవత్సరంలో రెండు వేర్వేరు సమయాల్లో జరుపుకుంటారు. సౌర క్యాలెండర్ ఆధారంగా.. హిందూ నూతన సంవత్సరాన్ని తమిళనాడులో పుతండు, అస్సాంలో బిహు, పంజాబ్‌లో వైశాఖి, ఒరిస్సాలో పణ సంక్రాంతి, పశ్చిమ బెంగాల్‌లో నబ బర్ష అని పిలుస్తారు. ఉగాది రోజు తొమ్మిది రోజుల వేడుక అయిన చైత్ర నవరాత్రి జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులలో, ప్రజలు దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు.

ఉగాది 2025 తేదీ, సమయం

ఈ సంవత్సరం ఉగాదిని మార్చి 30, 2025న జరుపుకుంటారు. ప్రతిపాద తిథి మార్చి 29, 2025న మధ్యాహ్నం 04:27 గంటలకు ప్రారంభమై మార్చి 30, 2025న మధ్యాహ్నం 12:49 గంటలకు ముగుస్తుంది.

తరవాత కథనం