Urine infection: యూరిన్ ఈ కలర్‌లో వస్తుందా?.. తస్మత్ జాగ్రత్త!

Urine colours

సాధారణంగా యూరిన్ కలర్ వైట్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఒక్కసారి పసుపు కలర్ లో కనిపిస్తుంది. అయితే ఈ రెండు సాధారణమైన విషయాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో ఉంటే మాత్రం తప్పకుండా వైద్యులకు వద్దకు వెళ్లాల్సిందే. అయితే ఇలా యూరిన్ కలర్ మారడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి.

రకరకాల మెడిసిన్స్ తీసుకున్నప్పుడు, అలాగే తక్కువ నీరు తాగినప్పుడు లేదా మరి ఏదైనా అనారోగ్యoతో బాధపడినప్పుడు యూరిన్ కలర్ అనేది మారుతుంది. అందువల్ల ఎప్పుడైతే యూరిన్ ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో మారుతుందో అది కాస్త ఆందోళన కలిగించే విషయం. అప్పుడప్పుడు ఇలా జరిగితే పరవాలేదు కానీ తరచుగా జరిగితే మాత్రం దానిని హేమటూరియా అంటారు.

దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు అజాగ్రత్తగా ఉన్నారంటే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా యూరిన్లో కూడా బ్లడ్ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడం చాలా కష్టం. యూరిన్లో రక్త స్థాయి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది కంటికి కనిపించదు. దానిని స్టుల్లో మాత్రమే గుర్తిస్తారు.

ఇక హేమాటోరియాకు ఎన్నో కారణాలు ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం, మూత్ర మార్గ సంక్రమణ, మూత్ర వ్యవస్థ లోని బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, మూత్రశయం వాపు అనేది హేమటూర్యాకు దారితీస్తాయి. అందువల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపిస్తుంది.

అలాగే కడుపునొప్పి, వికారం, వాంతులు, జ్వరం, వెన్నునొప్పి, వంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీలో రాల్లు హేమటూర్యాకు దారితీస్తాయి, కిడ్నీలో రాళ్లు మూత్రనాలంలో ఘర్షణకు గురై అధిక రక్తస్రావానికి దారితీస్తుంది. అలాగే కిడ్నీ లేదా మూత్ర హెమటూర్యాకు కారణం అవుతుంది. అందువల్ల ఇది చాలా తీవ్రమైనది కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్పుడు వైద్యుల సలహాతో ట్రీట్మెంట్ తీసుకోవాలి.

తరవాత కథనం