Vitamin E Food For Hair: జుట్టు బలహీనంగా మారడం, వేగంగా రాలిపోతుంటే.. అది పోషకాహార లోపం వల్ల కావచ్చు. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఇ చాలా ముఖ్యం. ఇది ఒక సహజ యాంటీ ఆక్సిడెంట్. అంతే కాకుండా ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది కూడా. జుట్టు పెరుగుదలను మెరుగు పరచడంలో కూడా విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టును మందంగా, బలంగా మార్చడానికి ఉపయోగపడుతుంది.
మీరు ఆరోగ్యకరమైన, పొడవాటి , మెరిసే జుట్టు కోరుకుంటే.. మాత్రం ఖచ్చితంగా మీ ఆహారంలో విటమిన్ E అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. అలాంటి 8 అద్భుతమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం:
బాదంపప్పులో విటమిన్ ఇ, ప్రోటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి . కాబట్టి వీటిని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. ఇవి తలకు పోషణ అందించడంతో పాటు జుట్టు తెగిపోకుండా నివారిస్తాయి. రోజూ 5-6 బాదం పప్పులు తినడం వల్ల జుట్టు పెరుగుదలకు మేలు జరుగుతుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలు:
ఈ చిన్న విత్తనాలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో విటమిన్ E, జింక్ , సెలీనియం వంటివి పుష్కలంగా ఉంటాయి. పొద్దు తిరుగుడు విత్తనాలు తలపై ఉండే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఇవి జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి. మీరు వీటిని సలాడ్, స్మూతీ లేదా ఆరోగ్యకరమైన స్నాక్‌గా కూడా తినవచ్చు.
పాలకూర:
పాలకూర ఐరన్, విటమిన్ E యొక్క అద్భుతమైన మూలం. ఇది జుట్టుకు సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా తలకు ఆక్సిజన్ సరఫరాను పెంచడం ద్వారా జుట్టును బలపరుస్తుంది. మీరు దీన్ని మీ ఆహారంలో సూప్, కూరగాయలు లేదా స్మూతీ రూపంలో కూడా చేర్చుకోవచ్చు.
అవకాడో:
అవకాడో అనేది విటమిన్ E , ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న అధిక పోషకాలు కలిగిన ఆహారం. ఇది జుట్టును లోతుగా కండిషనింగ్ చేస్తుంది. ఇది తేమను నిలుపుకుంటుంది. అంతే కాకుండా జుట్టును మెరిసేలా చేస్తుంది. మీరు దీన్ని సలాడ్, శాండ్‌విచ్ లేదా స్మూతీగా కూడా మీరు తినవచ్చు.
వేరుశనగ:
వేరుశనగలో విటమిన్ ఇ, బయోటిన్ , ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే.. వేరుశనగ లేదా వేరుశనగ వెన్న తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడికాయ గింజలు జుట్టు పెరుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిలో విటమిన్ E, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్ ఉంటాయి. ఇవి తల చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జుట్టు పొడవుగా , మందంగా ఉండటానికి సహాయపడతాయి.
బ్రోకలీ:
మీకు ఆరోగ్యకరమైన , ఒత్తైన జుట్టు కావాలంటే.. ఖచ్చితంగా మీ ఆహారంలో బ్రోకలీని చేర్చుకోండి. విటమిన్ ఇ తో పాటు.. ఇందులో విటమిన్ సి , ఫైబర్ కూడా ఉంటాయి. ఇది జుట్టును లోపలి నుండి పోషించడం ద్వారా జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా , పొడవుగా పెరగాలంటే బ్రోకలీ తినడం అలవాటు చేసుకోవాలి.