White Hair: తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి నాచురల్ చిట్కా

White Hair

White Hair: సాధారణంగా వయసుపైబడే కొంది తెల్లజుట్టు వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా కొంత మందికి జీన్స్ పరంగా వస్తుంది. మరికొంత మందికి జన్యు లోపం వల్ల కానీ, ప్రతిరోజు డైట్‌లో సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా స్ట్రెస్‌కి గురికావడం, బయట కాలుష్యం వల్ల తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. కాబట్టి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వారంటే.. వైట్ హెయిర్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుుడు తెలుసుకుందాం.

ఆవాల నూనె, పసుపు హెయిర్ మాస్క్
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కప్పు మస్టర్డ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరె గిన్నెలోకి తీసుకుని అందులో విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్లకు పెట్టుకుని అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

పెరుగు, కాఫీ, తేనె హెయిర్ మాస్క్
చిన్న బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాఫీ పొడిలో జుట్టు నల్లగా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా క్రమం తప్పకుండా వాడితే తెల్లజుట్టును నల్లగా మార్చడంతో పాటు జుట్టు చాలా సిల్కీగా మారుతుంది.

గోరింటాకు పొడి, మెంతులు, బ్లాక్ సీడ్ హెయిర్ మాస్క్
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్, టీ పొడి టీస్పూన్, మెంతులు, బ్లాక్ సీడ్స్ వేసి బాగా 10 నిమిషాలపాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి వడకట్టుకుని అందులో గోరింటాకు పొడి కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుది. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.

తరవాత కథనం