Fashion: ఇది గమనించారా.. షర్ట్‌కు ఎడమవైపే పాకెట్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఫ్యాషన్ వరల్డ్ లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉంటాయి. ఒక్కో ఫ్యాషన్ డిజైనర్ ఒక్కో విధంగా తమ ప్రతిభను చూపిస్తారు. కొందరికి అవి అర్థమవుతాయి.. మరికొందరికి అంతు చిక్కవు. ఆ డ్రెస్ అలా ఎందుకు చేసారు.. ఈ డ్రెస్ ఇలా ఎందుకు చేశారు అంటూ ప్రశ్నలు వేస్తారు.

షర్ట్స్ ను ఒకప్పుడు పురుషులు మాత్రమే ధరించేవారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా షర్ట్లు ప్యాంట్లు ధరిస్తున్నారు. దీంతో రకరకాల దుస్తులు మార్కెట్లోకి వస్తున్నాయి దీంతో ఫ్యాషన్ ప్రపంచంలో షర్ట్ లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది.

అదే సమయంలో షట్లకు పాకెట్ ఎప్పుడూ ఎడమవైపే ఎందుకు ఉంటుందో అనే ప్రశ్న అందులోనూ తలెత్తింది. చాలా షర్ట్ ల జేబులు ఎడం వైపే ఎందుకు ఉంటాయో అని చాలామంది లో ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకు గల సమాధానాన్ని తెలుసుకుందాం.

చొక్కాకు ఎడమవైపున పాకెట్ స్ ఉండటం వెనుక ఎలాంటి శాస్త్రియ కారణం లేదు. ఎందుకంటే చరిత్ర ప్రకారం మొదట్లో షర్టులకు పాకెట్స్ అనేవి ఉండేవి కాదు. రాను రాను చుక్కలకు జేబులు పెట్టారు. అయితే కేవలం కంఫర్ట్ దృష్టిలో ఉంచుకొని ఇలా పెట్టారు. పెన్ను, డబ్బులు, చిన్న డైరీ వంటి వస్తువులను చేతిలో పట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు.

అందువల్ల కాలక్రమేనా షట్లకు పాకెట్స్ పెట్టుకునే ట్రైన్ మొదలైంది. చాలామందికి ఎడమ వైపు నుంచి వస్తువులు తీయడం చాలా ఈజీ. అంతే కాకుండా ఎక్కువమంది కుడి చేతి వాటం కలవారికి ఎడమవైపున జేబులు కలిగి ఉండడం మరింత సౌకర్యవంతం. ఇక ఇది కాలక్రమేణా మారుతూ వస్తుంది. ఇప్పుడు చొక్కాలకు రెండు వైపులా జేబులు ఉంటున్నాయి.

తరవాత కథనం