Atul Subhash suicide case Story: భార్య నుంచి వేధింపులు భరించలేక ప్రాణంతీసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కేసులో ఆయన భార్య సహా అత్తింటివారిని అరెస్ట్ చేశారు పోలీసులు.
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న ఆయన భార్య నికితను, ఆమె తల్లిని, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. భార్య నుంచి వేధింపులు భరించలేక ప్రాణం తీసుకున్న సుభాష్..24 పేజీల సుదీర్ఘ లేఖరాయడంతో పాటూ గంటా 20 నిముషాల వీడియో తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇంకా న్యాయం జరగాల్సి ఉందని రాసుకొచ్చారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. మాకేదీ రక్షణ అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. లెటెస్ట్ గా అతుల్ భార్య నికితా సహా ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.
అతుల్ రాసిన 24 పేజీల లేఖలో ఏముందంటే..
ప్రతి పేజీలో ‘జస్టిస్ ఈజ్ డ్యూ’ అనే పెద్ద హెడ్డింగ్ ఉంది..తన డబ్బు తీసుకుని అదే డబ్బుతో తన కుటుంబంపై యుద్ధం చేయడాన్ని అనుమతించబోనని , కోర్టుల్లో లంచాలు అడిగారు కానీ తాను అవినీతికి పాల్పడదల్చుకోలేదని రాసుకొచ్చాడు. రెండు సందర్భాల్లో తన భార్య తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని…ఓ సందర్భం జడ్జి సమక్షంలోనే వచ్చిందన్నాడు. జడ్జి ఏకపక్షంగా వ్యవహరించారంటూ కోర్టులో తనకు జరిగిన అన్యాయం గురించి ప్రతి విషయం పేర్కొన్నాడు. మూడేళ్ల కొడుకుని కనీం చూడనివ్వలేదు కానీ తన ఖర్చులకోసం నెలకు 2 లక్షలు వసూలు చేశారని..కోర్టు కూడా ఈ విషయంలో సహకరించలేదని బాధను వ్యక్తం చేశాడు. హత్యాయత్నం, అసహజ శృంగారం, వరకట్న వేధింపుల ఇంలా ఎన్నో తప్పుడు కేసులు తనపై పెట్టారన్నారు. కేసును 120 సార్లు వాయిదా వేయడం వల్ల తనతో పాటూ తన వృద్ధ తల్లిదండ్రులు కూడా తరచూ ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నాడు. పంజుగ, పూజ వచ్చిందంటే చాలు ప్రతిసారీ 6 చీరలు, 10 లక్షల విలువైన ఆభరణాలు డిమాండ్ చేసేవారని …డబ్బులు ఇవ్వను అన్నప్పుడల్లా గొడవలే అని ఇంకా..తనకు జరిగిన అన్యాయం మొత్తం రాసుకొచ్చాడు..వీడియో ద్వారా వివరించాడు.
ఇంతకీ అతుల్ సుభాష్ డిమాండ్స్ ఏంటి?
ఈ కేసు విచారణ మొత్తం లైవ్ లోనే జరగాలి..లేఖ, వీడియోను మరణవాంగ్మూలంగా తీసుకోవాలి. యూపీలో కోర్టుల కన్నా బెంగళూరు నయం.. అందుకే కేసును ఇక్కడకు మార్చాలి. నాకొడుకుని నా తల్లిదండ్రులకు అప్పగించాలి..నా శవం దగ్గరకు నా భార్య కానీ, ఆమె తరపు బంధువులు కానీ రాకూడదు. కోర్టు కేసు తేలేవరకూ నా ఆస్తికలు ఏ నదుల్లోనూ కలపొద్దు. నా భార్యకు, అవినీతిపరురాలైన జడ్జికి శిక్ష పడకపోతే కోర్టు ఎదురుగా మురికి గుంటలో నా ఆస్తికలు పడేయండి. నన్ను, నా కుటుంబాన్ని వేధించిన వారికి శిక్ష పడాలి..తప్పుడు కేసులు పెట్టాను అని ఒప్పుకుంటే కానీ కేసులు వెనక్కు తీసుకోనీయకండి..వారితో రాజీపడొద్దంటూ ..తన బాధను, ఆవేదను మొత్తం రాసి..ప్రతి పేజీపై సంతకం చేశాడుయ
మనదేశంలో ఆత్మహత్యల వార్తలు నిత్యం చూస్తూనే ఉంటాం..వింటూనే ఉంటాం..కానీ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఆత్మహత్య తర్వాత.. సోషల్ మీడియా వేదికగా మగవారి హక్కులపై పెద్ద చర్చ జరుగుతోంది.
లేటెస్ట్ గా… అతుల్ సుభాష్ భార్య నికిత, ఆమె తల్లి, సోదరుడు అరెస్ట్ కావడంతో ఈ కేసు విచారణ ఎలా జరుగుతుంది? అతుల్ సుభాష్ డిమాండ్స్ ఏ మేరకు నెరవేరుతాయనేది ప్రజెంట్ డిస్కషన్..
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!