అలేఖ్య చిట్టి పికిల్స్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ప్రారంభమైంది. అక్కడ ముగ్గురు సిస్టర్స్ అలేఖ్య, చిట్టి, రమ్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. కొంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ పికిల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. రొయ్యలు, చేపల పికిల్స్ వంటి మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు నమ్మకమైన కస్టమర్ బేస్‌ను నిర్మించడానికి వారి సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించుకున్నారు. 2025 ఏప్రిల్ ప్రారంభంలో ఒక కస్టమర్ వాట్సాప్ ద్వారా కిలో రొయ్యల పచ్చడి గురించి వాకాబు చేశాడు. దానికి వారి నుంచి రూ. 3,000 అని సమాధానం వచ్చింది. ఈ అధిక ధర గురించి ప్రశ్నించాడు. దీనికి వారి నుంచి వచ్చిన సమాధానం మొత్తం స్టోరీనే మలుపు తిప్పేసింది. బూతులు మాట్లాడుతూ వారి నుంచి సమాధానం వచ్చింది.
కస్టమర్‌ను అలా బూతులతో తిట్టిన ఆడియో గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాను షేక్ చేసి పడేసింది. “మీరు ఊరగాయలకు రూ. 3,000 చెల్లించలేకపోతే, మీ భార్య కోసం మీరు ఏ బంగారాన్ని కొంటారు?” అనే సందేశం ఆగ్రహానికి కారణమైంది. X వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఆడియాను నెటిజన్లు వైరల్ చేశారు. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి ఊరగాయలు రాత్రికి రాత్రే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
కెరీర్‌పై ఫోకస్ చేయాలనే మాటపై మీమ్స్ దారుణంగా నడుస్తున్నాయి.
అలేఖ్య చిట్టీ పికిల్స్‌పై అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన ఏఐ వీడియోతో నడుస్తున్న ట్రోలింగ్
మీమ్స్ ముంచెత్తాయి
లీక్ అయిన ఆడియో ఆగ్రహాన్ని రేకెత్తించడమే కాదు; ఈ అక్కాచెల్లెళ్లను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. X అండ్ Instagramలోని నెటిజన్లు సమయం వృధా చేయలేదు, మీమ్ పేజీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వాళ్లను ఉతికి ఆరేశారు. దీంతో ఓ నెటిజన్ X పోస్ట్ లో ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టాడు “ఊరగాయ ధరలు ❌ అస్థి పేపర్స్” అని హాస్యంగా రాశారు. దీని ధర ఆహారం కంటే అంత్యక్రియల ఖర్చులకు సరిపోతుందని అని మరొక వినియోగదారుడు అభిప్రాయపడ్డారు.
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని వాడుకొని షార్ట్‌ఫిల్మ్స్ కూాడా తీసేస్తున్నారు.
అలేఖ్య చిట్టి పికిల్స్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించిన సిస్టర్స్
ఈ కంటెంట్ వినాలనుకునే వాళ్లు ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించమని కోరుతూ ఒక శీర్షికతో ఆడియోను షేర్ చేశారు. దీన్ని లక్షల మంది రీట్వీట్‌లు వచ్చాయి. ట్రోల్స్ ఆ సోదరీమణులను “చిట్టి సిస్టర్స్” అని మీమ్స్‌తో పేల్చి, వారి వ్యాపారాన్ని పంచ్‌లైన్‌గా మార్చాయి. ట్రోలింగ్ దాడి ఇంకా కొనసాగుతోంది.
సోషల్ మీడియాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని చెప్పేలా మరో వీడియో వైరల్ అవుతోంది.
వ్యాపారం దుమ్ము దులిపింది – ఆర్డర్లు ఆగిపోయాయి
ఒక్క ఆడియోతో వారి వ్యాపారం కుప్పకూలింది. ఏప్రిల్ 3, 2025 నాటికి అలేఖ్య చిట్టి పికిల్స్ ఆన్‌లైన్ ఆర్డర్‌లను నిలిపివేసింది. వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (@alekhyaachitti_pickles) సైలెంట్ అయిపోయింది. వారి వెబ్‌సైట్ అందుబాటులో లేకుండా పోయింది. వారి కాంటాక్ట్ నంబర్‌ను స్విచ్ ఆఫ్ చేశారు. సోషల్ మీడియా శక్తిని తక్కువ అంచనా వేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు.
ఈ వివాదంతో ఆ బ్రాండ్‌ను బహిష్కరించాలని కొందరు కోరుతున్నారు. మరికొందరు ఆడియో నకిలీ కావచ్చు లేదా పోటీదారుడి కుట్ర కావచ్చని సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు.ఈ చర్చలు జరుగుతుండగానే వేర్వేరు వ్యక్తులతో ఈ సిస్టర్స్ మాట్లాడిన ఆడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పొరపాటు జరిగిందని రమ్య చెప్పుకొచ్చింది. ఇలా వస్తున్న ఆడియోలు వారి విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తున్నాయి.
నేర్చుకున్న పాఠాలు
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం డిజిటల్ యుగంలో చిన్న వ్యాపారాలకు హెచ్చరిక కథగా నిలుస్తుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి దూషించిన వరకు అలేఖ్య సిస్టర్స్ ప్రయాణం ఆన్‌లైన్ సెంటిమెంట్ ఎంత త్వరగా మారుతుందో నొక్కి చెబుతుంది. వివాదం సద్దుమణిగిన తర్వాత తిరిగి వస్తారని కొందరు అంచనా వేస్తుండగా, మరికొందరు నష్టం పూడ్చలేనిదని నమ్ముతారు. చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు.