TDP LOKESH: ప్రభుత్వం, టీడీపీలో నిర్ణయాలన్నీ నారా లోకేష్ చాయిస్ మేరకే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ అనే ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసుకోవాలనుకున్నారు. కానీ టీడీపీ సోషల్ మీడియా ఆయన జగన్ హయాంలో చేసిన నిర్వాకాలంటూ కొన్ని పోస్టులు వెలుగులోకి వచ్చాయి. తర్వాత విజయానంద్‌కు సీఎస్ గా నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే… విజయానంద్ కు మద్దతుగా లోకేష్ సిఫారసు చేశారు . దాంతో ఆయనకే పీఠం ఖరారయింది. తరవాత సాయిప్రసాద్ కు ఇస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
పార్టీ, ప్రభుత్వంపై లోకేష్ పట్టు
పార్టీ విషయంలోనూ ఆయన చాలా సీరియస్ గా ఉంటారు. ఎంత సీనియర్ అయినా పార్టీకి ఉపయోగపడతారు అంటేనే ప్రోత్సహిస్తున్నారు. లేకపోతే సలహాదారు పాత్రకు పరిమితం కావాలని గట్టిగా చెబుతున్నారు. పదవుల్ని మాత్రం పైరవీలతో సంబంధం లేకుండా పార్టీ కోసం గ్రౌండ్ లెవల్లో పని చేసిన వారికి ఇస్తున్నారు. ఆ విషయం ఇప్పటివరకూ ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల జాబితాలోనే స్పష్టం అయింది. నారా లోకేష్ యువ నేత. ఆయనకో విజన్ ఉంది. అభివృద్ధి, మన దగ్గర ఒక్క పరిశ్రమ వస్తే వందల మందికి ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుంది. బతుకులు బాగుపడతాయి . రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇది నారా లోకేష్ ఆలోచనా విధానం. అది పారిశ్రామిక వేత్తలనూ ఆకట్టుకుంటోంది.
ప్రభుత్వంలో అన్నీ ఆయన కనుసన్నల్లోనే !
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోరని అంటారు. కానీ నారా లోకేష్ అటు పాలనను.. ఇటు పార్టీనే కాదు చివరికి రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడుల ఆకర్షణలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కొత్తగా ఆలోచిస్తున్నారు. సాధారణంగా పేరెంట్స్,టీచర్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇది కేవలం విద్యార్థుల చదువుల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు కాదు.. మొత్తం స్కూల్ మెరుగుదలకు చేస్తున్న ప్రయత్నం. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా.. డీప్ టెక్‌ను అభివృద్ధి చేసి.. తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇన్నొవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలాతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద చేపట్టిన 3 ప్రాజెక్ట్‌ల కోసం.. మొబైల్ టవర్లు, రైట్ ఆఫ్ వే కోసం భూమి కేటాయింపులు, అనుమతులు మంజూరు చేశారు. గిరిజన, గిరిజనేతర మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ బ్లాక్ స్పాట్‌లను గుర్తించి, పరిష్కారానికి కృషిచేస్తున్నారు.
అన్ని శాఖలపైనా తనదైన ముద్ర
ప్రోత్సాహకాలతో 2024-29 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్ల్పే ఫ్యాబ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీలను ప్రకటించారు. లోకేష్ చొరవతో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులకు టాటా గ్రూప్ సిద్ధమైంది. రాష్ట్రంలో 65 వేల కోట్లతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికీ గోల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తంచేసింది. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.60 వేల కోట్లతో 10వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను స్థాపించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఇలా నారా లోకేష్ ప్రతీశాఖ విషయంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఓ రకంగా పార్టీ ప్రభుత్వంపై పట్టు సాధించారని అనుకోవచ్చు.