Puspha 2: పుష్ప ది రూల్ సినిమా ప్రీమియర్ షోకు హాజరైన ఓ కుటుంబం తొక్కిసలాటలో తీవ్రంగా నష్టోయింది. ఓ మహిళ చనిపోయింది. మరో బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అసలు ఈ తొక్కిసలాట ఎలా జరిగిందన్నది చాలా మందికి సస్పెన్స్స గానే ఉంది. ఎందుకు ఇలా జరిగిందన్నది కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇది పూర్తిగా నిర్లక్ష్యం .. హీరో గారి అతి వల్లనే జరిగిందని అక్కడ జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
బలప్రదర్శన కోసమే హంగామా చేసిన అల్లు అర్జున్
సంధ్య ధియేటర్‌లో ప్రీమియర్లు వేసిన రోజున అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది టిక్కెట్లు కొనుగోలు చేశారు. టిక్కెట్లు కౌంటర్లలో అమ్మలేదు. ఆ ప్రీమియర్ షోల నిర్వాహకులే వివిద మార్గాల ద్వారా భారీ రేట్లకు అమ్ముకున్నారు. దిల్ సుఖ్ నగర్‌లో నివసించే ఓ కుటుంబానికి అల్లు అర్జున్ అంటే పిచ్చి. ఆ కుటుంబంలో పదేళ్లలోపు ఉండే బాలుడికి అర్జున్ స్టైల్ అంటే ప్రాణం. తమ పిల్లవాడి అభిమానం కోసం అయినా ప్రీమియర్ షో చూపించాలనుకున్నారు.భారీ ధర పెట్టి టిక్కెట్లు కొన్నారు. సినిమా చూసేందుకు వెళ్లారు. అక్కడ టిక్కెట్లు కొన్న వాళ్లు మాత్రమే ఉంటారు.. కాబట్టి తొక్కిసలాట జరిగే అవకాశం లేదు. కానీ వారి దురదృష్టం వారిని అభిమాన హీరో రూపంలోనే వెంటపడింది.
శిల్పా రవిచంద్రారెడ్డిని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏమిటి ?
సంధ్యాదియేటర్‌లో సినిమా చూసేందుకు పవన్ కల్యాణ్ బలగంతో వచ్చారు. ఆయన ధియేటర్ కు కిలోమీటర్ ముందు నుంచి రోడ్ షో చేసుకుంటూ రావడంతో ఆయన వస్తున్న విషయం తెలిసి చాలా మంది గుమికూడారు. అర్జున్ తో కలిసి ధియేటర్ లోకి వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిదింది. అప్పటికే ధియేటర్ లోకి వెళ్లేందుకు గేటు వరకూ వెళ్లిన ఆ కుటుంబం అక్కడ విడిపోయారు. తండ్రి తన పాపను తీసుకుని బయటపడ్డారు. కానీ ఆ తల్లి కుమారుడితో కలిసి హీరోతో పాటు వచ్చిన బలం కాళ్ల కింద నలిగిపోయారు. ఫలితంగా ఆ తల్లి ప్రాణం పోయింది. ఆ కుమారుడి ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. ఈ తొక్కిసలాట అంతా అల్లు అర్జున్ సమీపంలోనే జరిగింది. కానీ ఆయన పట్టించుకోకుండా లోపలికి వెళ్లి సినిమా చూసి తన దోవన తాను పోయారు.
రెచ్చగొట్టే ధోరణితో పతనానికి మొదటి అడుగు వేసిన అర్జున్
అల్లు అర్జున్ ఎవరికీ చెప్పకుండా వచ్చారు. ప్లాన్ చేసింది కాదు. అందుకే పోలీసులకూ చెప్పలేదు. ఆయన అంత అన్ ప్లాన్డ్‌గా ఎందుకు వచ్చారంటే.. రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. ఆయనతో పాటు శిల్పా రవిచంద్రారెడ్డి అనే తన మిత్రుడ్ని తీసుకు వచ్చారు. ఆ విషయం ఓ పార్టీ అనుకూల మీడియాకు లీక్ చేశారు. ఈ శిల్పారవిచంద్రారెడ్డి కోసం నంద్యాల ప్రచారానికి వెళ్లారు అర్జున్. అప్పట్నుంచి వివాదం ఉంది. ఈ క్రమంలో తన వ్యతిరేకుల్ని రెచ్చగొట్టేందుకు ఈ రవిచంద్రారెడ్డిని తీసుకుని ప్రీమియర్ కు వెళ్లారన్న అభిప్రాయం అవినిపిస్తోంది. అందులే రోడ్ షో చేసుకుంటూ వచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అర్జున్ ను వెంటాడనున్న సంధ్యా ధియేటర్ విషాదం
ఈ తొక్కిసలాట పూర్తిగా నివారించదగ్గది..అసలు జరగకూడనిది. జరిగింది అంటే అది ఖచ్చితంగా హీరో అర్జున్ నిర్వాకం అని చెప్పక తప్పదు. తర్వాత హీరో వస్తున్నారని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వని ధియేటర్ యాజమాన్యానిది. కానీ బాధితులు మాత్రం అల్లు అర్జున్ ను పిచ్చిగా అభిమానించిన ఓ కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడింది. దీనికి బాధ్యులెవరు ?. అర్జున్ పాతిక లక్షల రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదు. ఈ ఘటన పరిణామాలు ముందు ముందు చాలా ఉంటాయి.