ఐరన్ లంగ్స్‌తో ఎన్నేళ్లైనా బతికేయచ్చు- పాల్ అలెగ్జాండర్‌ జీవిత చరిత్రే ఉదాహరణ

iron lungs

పాల్ అలెగ్జాండర్ 2024 మార్చి 14న మరణించారు. ఆయన బతికిఉన్నప్పుడు కొందరికే తెలిసే ఉంటుందేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది ఆయన కోసం వెతుకుతున్నారు. పోలియో పాల్‌గా పిలుచుకునే పాల్ అలెగ్జాండర్ (78) కన్నుమూశారు. అమెరికాలోని డల్లాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కోవిడ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు.
పాల్ అలెగ్జాండర్ మరణానంతరం ఇనుప ఊపిరితిత్తుల గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ ‘ఐరన్ ఊపిరితిత్తులు’ అంటే ఏమిటో ఈ ఆర్టికల‌్‌లో చూడవచ్చు. ఇంతకీ ఎలా పనిచేస్తుంది? ఇది వైద్య, ఇంజనీరింగ్ రంగాలలో ఎలా పిలుస్తారో చూద్దాం. దాదాపు శతాబ్దం క్రితం దీన్ని రూపొందించారు. ఏర్పడినప్పటి నుంచి ఇది ప్రాణాలను కాపాడే యంత్రంలా పనిచేస్తోంది. దీన్నే ఐరన్ ఊపిరితిత్తులు అంటారు.

ఐరన్ లంగ్స్‌ అంటే ఏమిటి?
ఈ పేరు వినడానికే కొంచెం భయకరంగా ఉంటుంది. చూడటానికి ఇది శవపేటిక యంత్రంలాగా కనిపిస్తుంది. శవపేటికలా కనిపించినా మ్యాజిక్ చేస్తుంది. 1952లో అమెరికాలో పోలియో వ్యాప్తి చెందినప్పుడు అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. వారిలో ఒకరే అలెగ్జాండర్‌ పాల్. 6 సంవత్సరాల వయస్సులో పాల్‌ పోలియో బారిన పడ్డాడు. దీని కారణంగా పాల్ ఊపిరితిత్తులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందుకే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.

ఐరన్ లంగ్స్‌ ఎలా పనిచేస్తాయి?
ఈ ఐరన్ లంగ్ 1927 లో అభివృద్ధి చేశారు. 1928లో క్లినికల్ సెట్టింగ్‌లో మొదటిసారి ఉపయోగించారు. అది ఒక బాధిత చిన్నారి ప్రాణాలను కాపాడింది. అలా వేల మందిని కాపాడింది.
ఈ ఐరన్ లంగ్స్‌ యంత్రాన్ని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన లూయిస్ అగసిజ్ షాతో కలిసి ఫిలిప్ డ్రింకర్ దీన్ని కనిపెట్టారు. వీళ్లు బొగ్గు-గ్యాస్ ద్వారా ప్రబలే విషానికి చేపట్టాల్సిన ప్రత్యేకంగా చికిత్స గురించి అధ్యయనం చేశారు. అలా రూపొందించినదే ఐరన్‌ లంగ్స్‌ యంత్రం. శ్వాస ఆడకపోవడం లేదా దెబ్బతిన్న ఊపిరితిత్తులు ఉన్నవారికి ఉపయోగపడుతుందని తర్వాత గ్రహించారు. తర్వాత ఇది పోలియో బాధితులకు కూడా సహాయపడుతుందని గ్రహించారు.

వాస్తవానికి ఈ ఐరన్ లంగ్స్‌ ఉక్కుతో తయారు చేస్తారు. ఈ యంత్రంలో మనిషిని ఉంచి తలను బయట ఉంచుతారు. మెడ చుట్టూ రబ్బరు కాలర్ తయారు చేశారు. దీని ద్వారా రోగి తల బయట ఉంచుతారు. మొదటి ఇనుప ఊపిరితిత్తులను ఎలక్ట్రిక్ మోటారు అండ్‌ కొన్ని వాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ పంపులతో నడిపారు. ఇది వెంటిలేషన్ ద్వారా పనిచేస్తుంది. రోగి ఊపిరితిత్తుల్లోకి గాలి సౌకర్యవంతంగా చేరే విధంగా, అవసరాన్ని బట్టి రోగికి ఆక్సిజన్ అందేలా దీన్ని తయారు చేశారు.

రోగి కండరాలు పని చేయలేకపోయినా ఈ యంత్రం లోపల ఆక్సిజన్ సౌకర్యంగా చేరుతుంది. ఈ యంత్రం లోపల పంపు పని చేస్తున్నంత సేపు రోగి సజీవంగా ఉంటాడు. ఇలా ఇది పని చేసినన్ని రోజులు మనిషి జీవిస్తాడు. ఇప్పుడు పాల్ అలెగ్జాండర్ కూడా అదే చేశారు. ఆరేళ్ల వయసు నుంచి 78 ఏళ్ల వరకు అందులో జీవించారు. అక్కడి నుంచే డిగ్రీలు చేశారు. పీహెచ్‌డీలు చేశారు. తనకు వచ్చిన విజ్ఞానాన్ని పది మందికి పంచారు. కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు.

తరవాత కథనం