Chandrababu: త్వరలోనే బీసీ రక్షణ చట్టం తెస్తున్నాం.. చంద్రబాబు కీలక ప్రకటన

chandrababu

త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలో మహాత్మ జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఆపై బీసీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో పూలే ఒకరిని కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అని అన్నారు. స్త్రీ విద్యకు ఆ రోజుల్లోనే ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి పూలే అని కొనియాడారు.

పూలే బాటలోనే నందమూరి తారక రామారావు రాష్ట్రంలో మహిళ విద్యకు పెద్దపీట వేశారని తెలిపారు. ఇక రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ టిడిపి అని పేర్కొన్నారు. తనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలా అందరం బీసీల కోసం ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా బీసీల కోసం రక్షణ చట్టం తీసుకొస్తాం అని హామీ ఇచ్చారు.

ఎస్సీ ఎస్టీలకు ఎలా అయితే అట్రాసిటీ యాక్ట్ రక్షణ కల్పిస్తున్నాయో.. త్వరలో బీసీల కోసం స్పెషల్గా రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. దీనిపై ఇప్పటికే సబ్ కమిటీ వేశామని ఆ నివేదిక ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. అలాగే బీసీలకు మళ్ళీ 34 శాతానికి రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.

తరవాత కథనం