Pawan Kalyan: ఇప్పుడు మీలో లీడర్‌ని చూస్తున్నాం సార్- మురిసిపోతున్న పవన్ ఫ్యాన్స్

pawan kalyan

Pawan Kalyan: సినిమా హీరోను గెలిపిస్తే మీ సమస్య వింటాడా?…ఇక్కడ ఉంటాడా? గీతమ్మ అయితే మీతో ఉంటుంది. మీలో ఒకరిగా ఉంటుంది. సమస్య ఏదైనా వస్తే నేను ఉన్నాను అంటూ వస్తుంది. ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేస్తాను. ఎన్నికల టైంలో పిఠాపురం పర్యటనలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రచారం. ఎన్నికల్లో గెలిచిన పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఉండరని గెలిపించిన ప్రజా సమస్యలు పట్టించుకోరని జగన్‌తోపాటు వైసీపీ నేతలంతా ఇంటింటికీ తిరిగి చెప్పారు.

కట్ చేస్తే పవన్ రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పిఠాపురంలోనే ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ఒక్క పిఠాపురం ప్రజలకే కాదు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఉన్న గిరిజన గూడెంలోని ప్రజల తలుపుతడుతున్నారు. మీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తానంటూ వారికి భరోసా ఇస్తున్నారు.

రెండు రోజుగా పవన్ కల్యాణ్‌ను చూసిన ఎవరికైనా ఇది కదా లీడర్‌కు ఉండాల్సిన లక్షణం. బటన్ నొక్కి డబ్బులు వేయడమా నాయకత్వం లక్షణం. ఇంటికి వెళ్లి సమస్య ఏముంది ఊరు బాగుందా…. ఊరికి రోడ్డు ఉందా అని అడిగి వారి కన్నీళ్లు తుడిచేవాడు నాయకుడా?

Image

కాలినడకన కిలోమీటర్లు నడుస్తూ… ఒళ్లంతా బురద, బట్టలు మొత్తం మట్టి మట్టి మట్టిగా ఉన్న పవన్ ఫొటోలు వీడియోలు చూస్తున్న ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పుడు ఆయన ఆహార్యం చూస్తున్న శత్రువులు కూడా శభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్‌ వైసీపీ నేతలకి కూడా తెగ నచ్చేస్తున్నారు. ఆ పార్టీని మోసే ఛానల్‌, పత్రికలో కూడా పవన్‌ను పొగుడుతూ కథనాలు రాస్తున్నారు.
కొండలు ఎక్కుతూ గుట్టలు దాటుకుంటూ అడవి బిడ్డల సమస్యలు వింటూ… అధికారులకు పరిష్కారాలు సూచిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగిన పవన్ కల్యాణ్ టూర్.ఆ దృశ్యాలను, ఫొటోలను చూసిన వారంతా ఇన్ని రోజులు పవన్‌లో ఓ సినిమా నటుడినో, ఆవేశంతో మాట్లాడే పొలిటికల్ పర్సనాలిటీనో చూసిన వారంతా ఇప్పుడు నిజమైన లీడర్‌ను చూస్తున్నారు.

Image

కొండలు ఎక్కారు.. గుట్టలు దాటారు.. పచ్చటి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. గిరిజనం చెంతకు వెళ్లారు. గిరిపుత్రుల కష్టాలను వారి మాటల్లోనే విన్నారు.. ఎప్పటికప్పుడు అధికారులకు పరిష్కార మార్గాలు సూచిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తూ.. అడవి బిడ్డలకు అండగా ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు పవన్ కల్యాణ. గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు తీర్చేందుకు నూతన రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు ఉత్తరాంధ్ర ఏజెన్సీలో పర్యటించిన పవన్ రెండో రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన గూడేల తలుపు తట్టారు. వాహనం వెళ్లే వీలు లేని కొండ ప్రాంతాల్లో కాలినడక తిరిగారు. జోరు వానలో కూడా ఆయన తన పర్యటన వాయిదా వేసుకోలేదు.

Image

పవన్ కల్యామ్ మనసుకు ఎంతో దగ్గరైన గిరిపుత్రులను కలుసుకునేందుకు కిలోమీటర్ల మేర రాళ్లు గుట్టల్లో నడిచారు. తమ కోసం వచ్చిన పవన్‌ను మహిళలు ఎదురొచ్చి వారి గిరిజన ఆచార సంప్రదాయాలతో స్వాగతించారు. ఏజెన్సీలో పండే పూలు, ఆకులతో తయారు చేసిన పుష్ప గుచ్చాలు అందించారు. తన కోసం గిరిజన మహిళలు తెచ్చిన ప్రతి పుష్పగుచ్చాన్ని స్వీకరించి, పేరు పేరునా వారికి పలుకరించి ఉత్సాహ పరిచారు.

కాలి నడకన వెళ్లేందుకు కూడా వీలు లేని తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు వచ్చిన పవన్ని దేవుడు సార్ మీరంటూ గిరిజన మహిళలు జేజేలు పలికారు. స్వతంత్ర భారత చరిత్రలో తమ గ్రామాలకు వచ్చిన మొట్టమొదటి నాయకుడు మీరంటూ కొనియాడారు. గిరిజన దేవతల జాతర్లలో పాడే పాటలు పాడుతూ.. పసుపు కలిపిన బియ్యాన్ని నుదుటిన దిద్దారు. తమ గ్రామాన్ని డోలీ మోతలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జీవితకాలం మీరు రుణపడి ఉంటామంటూ గిరిజన మహిళలు కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా సున్నితంగా తిరస్కరించారు. మా ఇళ్ళలో మీ ఫోటో పెట్టుకుంటామని చెప్పారు. గిరిజన డప్పు కళాకారులు డప్పులు కొడుతూ ఆహ్వానం పలుకగా, వారితో ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు.

Image

సమస్యలు చెప్పుకొన్న గిరిజనం
గిరి శిఖర గ్రామాల ప్రజలు తమ సమస్యలను పవన్ కి చెప్పుకున్నారు. రోడ్డు నిర్మాణంతో తమ సమస్యలు సగం తీరినట్టేనని చెప్పారు. గూడెల్లో ఇళ్లు మంజూరు అయినా ఫారెస్టు పట్టాల సమస్య కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని చెప్పారు. రోడ్లతోపాటు తాగు నీటికి ఇబ్బందులు ఉన్నాయని కొండపై గ్రామాల ప్రజలు తెలిపారు. చాలా గ్రామాల్లో 2014లో ఇళ్లు మంజూరు అయ్యాయని, అటవీ అనుమతులు లేక నిర్మాణానికి తెచ్చిన రేకులు పాడయ్యాయని వాపోయారు.

Image

గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించాలని కలెక్టర్ తోపాటు అటవీ అధికారులకు పవన్ ఆదేశించారు. పాడేరు డివిజన్ మొత్తం ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయో పరిశీలన చేసి అన్నింటికీ ఒకేసారి పట్టాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

గిరిజనుల హక్కులు కోల్పోకుండా ఉపాధి
గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి.. ఆదాయం రావాలి.. అదే సమయంలో అడవుల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు వారి హక్కులు కోల్పోకుండా అభివృద్ధి చెందే మార్గాలు అన్వేషిస్తాము. పర్యాటక అభివృద్ధి ద్వారా గిరిజనులకు అదనపు ఆదాయం వచ్చే ఏర్పాటు చేస్తాం. గిరిజనులు గంజాయి పండించడం, రవాణా వైపు వెళ్లకుండా యువత అవగాహన కల్పించాలి. విదేశాల నుంచి పర్యాటకులు మీ గూడెల్లోకి వచ్చే విధంగా ప్రణాళికులు రూపొందిస్తాం.. మీ గూడెంలోనే మీకు ఆదాయం లభించే విధంగా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం అప్పులు చేయడం మినహా అభివృద్ధి చేయలేదు. ప్రజల సమస్యలు పరిష్కరించలేదు. 2008లో ఆదిలాబాద్ తాండాల్లో నీటి సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు సొంత డబ్బుతో ఆ సమస్యను పరిష్కరించా. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం. శాయశక్తులా కృషి చేసి మీ సమస్యలు తీరుస్తాం. చాలా గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు ఉన్నాయని ముఖ్యమంత్రికి చెబితే తక్షణం రూ. 49 కోట్లు ఇచ్చారు. సమస్య అధికంగా ఉన్న చోట ఆ నిధులతో రోడ్లు వేస్తున్నాం. మరో 450 పంచాయతీలు ఉన్నాయి. సమీపంలో జూనియర్ కాలేజీ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామ’ని పవన్ భరోసా ఇచ్చారు.

Image

తరవాత కథనం