AP Teachers Posts : ఏపీలో 2,260 టీచ‌ర్ పోస్టులు.. డీఎస్సీ ద్వారా భ‌ర్తీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఏపీలో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ పోస్టుల భర్తీని డీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఇప్పుడు మరో 2260 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా స్కూల్ అసిస్టెంట్, ఎస్ జి టి పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ఎస్ జి టి పోస్టులను.. స్కూల్ అసిస్టెంట్, ప్రైమరీ లెవెల్ పోస్టులను సెకండరీ లెవెల్ గా పరిగణించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

జీవో నెంబర్ 13, జీవో నెంబర్ 12తో ఉన్న ప్రకటన విడుదల అయింది. 2021 అక్టోబర్ 28న సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు 2025 మార్చి 7న గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ 2,260 పోస్టుల్లో 1136 ఎస్ జి టి పోస్ట్లు, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల భర్తీని డీఎస్సీ ద్వారా నియామక చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

జిల్లాల వారీగా పోస్టులు

అనంత‌పురంలో ఖాళీలు

ఎస్‌జీటీ -101, స్కూల్ అసిస్టెంట్-100

చిత్తూరులో ఖాళీలు

ఎస్‌జీటీ -117, స్కూల్ అసిస్టెంట్-82

తూర్పుగోదావ‌రిలో ఖాళీలు

ఎస్‌జీటీ -127, స్కూల్ అసిస్టెంట్ -151

గుంటూరులో ఖాళీలు

ఎస్‌జీటీ -151, స్కూల్ అసిస్టెంట్ -98

వైఎస్ఆర్ క‌డ‌పలో ఖాళీలు

ఎస్‌జీటీ -57, స్కూల్ అసిస్టెంట్-49

కృష్ణాలో ఖాళీలు

ఎస్‌జీటీ-71, స్కూల్ అసిస్టెంట్-89

క‌ర్నూలులో ఖాళీలు

ఎస్‌జీటీ -110, స్కూల్ అసిస్టెంట్ -130

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరులో ఖాళీలు

ఎస్‌జీటీ -63, స్కూల్ అసిస్టెంట్ -44

ప్ర‌కాశంలో ఖాళీలు

ఎస్‌జీటీ -74, స్కూల్ అసిస్టెంట్-50

శ్రీకాకుళంలో ఖాళీలు

ఎస్‌జీటీ-71, స్కూల్ అసిస్టెంట్-109

విశాఖ‌ప‌ట్నంలో ఖాళీలు

ఎస్‌జీటీ -59, స్కూల్ అసిస్టెంట్ -52

విజ‌య‌న‌గరంలో ఖాళీలు

ఎస్‌జీటీ -45, స్కూల్ అసిస్టెంట్ -66

ప‌శ్చిమ గోదావ‌రిలో ఖాళీలు

ఎస్‌జీటీ -90, స్కూల్ అసిస్టెంట్ -105

తరవాత కథనం