Real Hero Pawan: అన్నా ఒక్క సారి తొడ కొట్టు అన్నా.. ఒక్క సారి మీసం తిప్పు అన్నా.. అన్నా ఓ మంచి డైలాగ్ చెప్పన్నా అంటూ డిప్యూటీ సీఎంను ఫ్యాన్స్ వేధిస్తున్నారు. ఆయనేమో మీకు హీరోలం మేము కాదురా బాబూ.. మీ అమ్మా నాన్నలు, చదువులు చెప్పే గురువులు అంటున్నారు. కానీ వారు వినిపించుకోవడం లేదు. ఎక్కడికెళ్లినా అదే సంత. వారంతా పవన్ కల్యాణ్ ను సినిమా హీరోగా ఉండమంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ తాను రియల్ హీరోని అయ్యానని చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు.
రాజకీయాల్లో రియల్ హీరో పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ ఇప్పుడు రియల్ హీరో. నరక ప్రాయమైన ఓ కఠినాత్ముడి పాలనను అంతం చేయడంలో ఆయనదికీలక పాత్ర. ఎన్నికల్లో విజయం తర్వాత ఆయనను రియల్ హీరోగా అంతా కీర్తించారు. పవన్ కు సినిమాల కన్నా రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి అని చాలా సార్లు చెప్పారు. జనం బతుకులు మార్చడానికి చేసే పోరాటం ఆయనకు నచ్చుతుంది. పొట్టకూటి కోసం సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్.. పవన్ కల్యాణ్ స్థాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే సంగతిని మరచిపోతున్నారు. ఆయన స్థాయికి తగ్గట్లుగా ఫ్యాన్స్ కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. తన పని తాను చేసుకోనివ్వాలని ఆయన కోరుకుంటున్నారు.
పవన్ ను రీల్ హీరోగానే చూస్తున్న జనం
పవన్ కల్యాణ్. ఫ్యాన్స్ మాత్రం ఆయనను చిరాకుపెడుతూనే ఉన్నారు. ఓజీ.. ఓజీ అని అరవడంతో పాటు “మీసం తిప్పు అన్నా” అంటూ అరుస్తున్న ఫ్యాన్స్ ను ఉద్దేశించి నవ్వుతూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒకే మిషన్ మీద ఉన్నారు. తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ లక్ష్యాలు వ్యక్తిగతమైనవి కావు. సమాజం కోసం.. ప్రజల కోసం. హీరోగా ఉంటే పవన్ కు ఎన్నో లగ్జరీలు వస్తాయి . కాలు కింద పెట్టకుండా షూటింగ్ చేసుకుని వందల కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ కోరుకుంది తన ఒక్కటి బాగు కాదు. ప్రజల బాగు కోసం ఆయన చూస్తున్నారు. తాను డిప్యూటీ సీఎం అయిన దానికి సరైన న్యాయం జరగాలంటే అది సినిమాలు కాదని .. సినీ హీరోయిజాన్ని తన పనుల రూపంలో ప్రజల ముందు ఉంచాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. దానికి ప్రతిఫలంగా కనిపించాల్సింది ఆ పనుల వల్ల బాగుపడిన జీవితాలే. అందుకే ఆయన కష్టపడుతున్నారు.
పవన్ ఫ్యాన్స్ ఎప్పుడు మారతారు?
నిజమైన హీరోలు టీచర్లేనని వారిని అభిమానించాలని పవన్ కల్యాణ్ ఇటీవల కడప జిల్లాలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కు వెళ్లినప్పుడు చెప్పారు. తాజాగా పార్వతీపురం మన్యం ప్రాంతంలోకి వెళ్లినప్పుడూ అదే అర్థం వచ్చేలా చెప్పారు. పవన్ కల్యాణ్ పెండింగ్ సినిమాలను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే వాటిపై కొన్ని వందల కోట్ల పెట్టుబడి పెట్టారు నిర్మాతలు. ఇప్పుడు వాటిని పూర్తి చేయకపోతే చాలా నష్టం వస్తుంది. అత్యంజ బిజీ అయినప్పటికీ వీలైనంతగా కాల్ షీట్లు కేటాయించి వాటిని పూర్తి చేసి.. ఆ బాధ్యతల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్‌లో ఇక ఫ్యాన్స్ హీరోను చూడటం ఆపేసి.. ఓ రాజకీయ నేతను చూడాలి.. ఓ డిప్యూటీ సీఎంను మాత్రమే చూడాలి. అదే పవన్ కోరుకునేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ లో రియల్ హీరోను చూడటం ప్రారంభించిన రోజున ఆయన మరింత ఉత్సాహంగా ప్రజల సమస్యను పరిష్కరించగలుగుతారు. మరి ఫ్యాన్స్ మారతారా.. పవన్ ను అలాగే చిరాకు పెడతారా?