Manchu Mohanbabu: మంచు మోహన్ బాబు చిన్న చిన్న క్యారెక్టర్లతో యాక్టింగ్ ప్రారభించి హీరోగా ఎదిగారు. ఎవరెవరో తనతో సినిమాలు తీస్తారని ఎదురు చూడకుండా తన డబ్బు పెట్టే సినిమాలు తీసుకున్నారు. మోహన్ బాబు ఎవరికీ డబ్బు పరంగా అన్యాయం చేశారన్న ప్రచారం లేదు.కానీ ఇప్పుడు ఆయన కుటుంబం రోడ్డున పడింది. దీనికి కారణం కూడా ఆయనే. ఆయన అతి ప్రేమ.. అతి క్రమశిక్షణ వల్లనే కుటుంబ పరువును రోడ్డుకీడ్చుకున్నారు.
మంచు విష్ణుపై అతి ప్రేమ
మంచు విష్ణుపై మోహన్ బాబు అతి ప్రేమను పెంచుకున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఆయనను హీరోగా పెట్టి ఇప్పటికి ఎన్ని సినిమాలు తీశారో లెక్కే లేదు. వాటిలో కనీసం పెట్టుబడి తిరిగి వచ్చిన సినిమాలు కూడా ఒకటి కూడా ఉంటాయని కూడా ఎవరూ అనుకోరు. అదే సమయంలో మంచు విష్ణునే తన వ్యాపారాలన్నింటికీ అధిపతి అన్నట్లుగా వ్యవహరించారు. విద్యాసంస్థలు కావొచ్చు.. కుటుంబపరంగా కావొచ్చు. ఆయనే అన్ని చోట్లా కనిపించారు. కనిపిస్తున్నారు. ఆయన దూకుడు వల్ల మంచు ఫ్యామిలీ చాలా కష్టాలు ఎదుర్కొంది. అవన్నీ చిన్నవి కావు. మా ఎన్నికల్లో గెలిపిస్తే భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు. అదికోట్ల రూపాయల విలువైన హామీ కావడంతో అంతా సైలెంటుగా అయిపోయారు.
మనోజ్ పై అతి క్రమశిక్షణ
విష్ణుపై చూపినదాంట్లో సగం కూడా మనోజ్‌పై ప్రేమ చూపించలేదు కానీ క్రమశిక్షణ మాత్రం అతిగా రుద్దారని అర్థం చేసుకోవచ్చు. మనోజ్ కు కుటుంబపరంగా వచ్చిన సపోర్టు చాలా తక్కువ. సినిమాల్లో విష్ణు కంటే కూడా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని ప్రచారం జరిగినా ఆయనను పట్టించుకోలేదు. వ్యక్తిగత జీవితం నాశనమైపోవడానికి కూడామోహన్ బాబు అతి క్రమశిక్షణే కారణమని అంటున్నారు. అతి గారాబం చేశానని చెప్పుకున్నారు కానీ ఆయన జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఏం చేశారో మాత్రం చెప్పలేకపోయారు. మనోజ్ దారి తప్పి ఉంటే అది ఖచ్చితంగా తండ్రిగా మోహన్ బాబు తప్పిదమేనని ఎక్కువ మంది భావిస్తున్నారు.
ఆస్తులు సమానంగా ఇవ్వనంటే కోపం రాదా ?
నా ఆస్తులు నా ఇష్టం అని మోహన్ బాబు చెప్పడంతోనే సమస్యలు పచ్చింది. స్వార్జితం ..దానికి ఆయనకు హక్కు ఉంది కానీ.. ముగ్గురు పిల్లల్ని సమానంగా చూడకపోతే వచ్చే సమస్యల్ని ఆయన గుర్తించలేకపోయారు. ఓ కుటుంబంలో తనపై వివక్ష చూపిస్తున్నారు అంటే.. ఆ వ్యక్తిలో జరిగే మానసిక క్షోభ అతన్ని ఏ స్థితికి చేరుస్తుందో చెప్పడం కష్టం. ఇప్పుడు మనోజ్ విషయంలో అదే జరిగిందని అనుకోవచ్చు. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. మొత్తం కుటుంబపరువు రోడ్డునపడింది. మోహన్ బాబు ఏళ్లుగా సంపాదించుకున్న పేరు మట్టిలో కలిసిపోయింది. దానికి పూర్తిగా మోహన్ బాస్ కారణం.
పరు ప్రఖ్యాతులన్నీ రోడ్డు పాలు
మోహన్ బాబు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అందులో సందేహం లేదు. కానీ వ్యక్తిగతంగా చేసిన తప్పుల కారణంగా ఇంత బతుకు బతికి గుడి వెనుక నాశనం అయిపోయిన చందంగా త యారు అయింది. కుమారుడ్ని దారిలో పెట్టుకోలేకపోయానని అందుకే సమస్యలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఆయన ఆయన కుటుంబంలోనే ఒకరిపై ప్రేమ.. మరొకరిపై వివక్ష చూపించడం వల్లనే అసలు సమస్యలు వచ్చాయని ఆయన అర్థం చేసుకుంటే పరిస్థితి ఇప్పటికైనా కుదటపడే అవకాశం ఉంది.