Donald Trump: అమెరికాలో ట్రంప్ నాన్న ఏం చేసేవాడో తెలుసా? ఇది మీరు ఊహించి ఉండరు

Donald Trump

యావత్ ప్రపంచానికే చుచ్చు పోయిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రాజకీయాల్లోకి రావడానికి ముందు గొప్ప వ్యాపారవేత్త అనే సంగతి అందరికీ తెలిసిందే. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెప్పడం ఆయనకు అలవాటు. అదే ఆయన్ని రాజకీయాల్లో భిన్నమైన నాయుకుడిలా నిలబెట్టింది. ట్రంప్‌కు దేశాభిమానం ఎక్కువగా. అందుకే.. అమెరికా ఫస్ట్, ఆ తర్వాతే ఎవరైనా అని అంటారు. అదే పంతంతో అధికారంలోకి వచ్చి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. అమెరికాలో పిల్లలను కనాలనుకొనే విదేశీయులకు కూడా వణికుపుట్టించాడు. అమెరికా వచ్చి పిల్లలను కంటే.. పౌరసత్వం ఇవ్వబోమంటూ చట్టంలో మార్పులు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అక్కడి న్యాయస్థానం ఆ నిర్ణయంపై స్టే విధించింది. అమెరికాలో ఉన్న ప్రవాసులకు నిద్రలేకుండా చేస్తున్న.. ఈ ట్రంప్ అసలు ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటీ? ఆయన తల్లిదండ్రులు ఏం చేసేవారు. ట్రంప్ అంత సంపన్నుడు ఎలా అయ్యాడు?

డోనాల్డ్ ట్రంప్.. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో 1946, జూన్ 14న జన్మించారు. జమైకా ఎస్టేట్‌లో ఆయన బాల్యమంతా గడించింది. ట్రంప్ సంపన్న కుటుంబంలో జన్మించాడు. ప్రస్తుతం ఇప్పుడు.. ఆయన అనుభవిస్తున్న ఆస్తులన్నీ ఆయన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ సమకూర్చినవే. అమెరికాలో పేరొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్. న్యూయార్క్‌లో చాలావరకు స్థిరాస్తులు ఆయన చేతుల్లోనే ఉండేవి. వారసత్వంగా ఆ వ్యాపారమే డోనల్డ్ ట్రంప్‌కు దక్కింది. అయితే, ట్రంప్.. తనకు ఉన్న తెలివి తేటలతో ఆ ఆస్తులను పదింతలు చేశారు. కేవలం స్థలాలను విక్రయించడమే కాకుండా.. ఆఫీసులు, హోటళ్లు, క్యాసినోస్, ఎస్టేట్లు నిర్మించారు. అలా ట్రంప్ అనే పేరును.. ఒక బ్రాండ్‌గా మార్చేశారు. అంతేకాదు.. ఆ పేరును వాడుకొనేందుకు హక్కులు కూడా విక్రయిస్తూ.. వాటి ద్వారా భారీగా సంపాదిస్తున్నారు ట్రంప్. అలా బిలియన్ల కొద్ది సంపాదన ట్రంప్ అకౌంట్లో పడుతుంది.

ట్రంప్ మాంచి రసిక రాజు…

డోనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యలున్నారు. ముగ్గురినీ ప్రేమించే పెళ్లి చేసుకున్నాడటని టాక్. వాళ్ల వివరాలు ఇవే.

ఇవానా ట్రంప్ (1977–1992): ట్రంప్ మొదటి భార్య ఇవానా జెల్నిచ్కోవా, జెకోస్లోవేకియాలో ఈమె జన్మించింది. ఈమె స్కీ చాంపియన్. ట్రంప్ ఆమెను 1977లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. అయితే ఇవానా, ట్రంప్ 1992లో విడిపోయారు. ట్రంప్ నటి మార్లా మేపుల్స్‌ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఇందుకు కారణం. అయితే విడాకుల తర్వాత ఇవానా, ట్రంప్ స్నేహంగా ఉండేవారు.

మార్లా మేపుల్స్ (1993–1999): ట్రంప్ 1993లో నటి మార్లా మేపుల్స్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె టిఫానీ ట్రంప్ ఉంది. 1999లో వీరిద్దరు విడిపోయారు. అయితే, వారి వివాహం అప్పట్లో పెద్ద సంచలనం. అక్రమ సంబంధం పెట్టుకున్న నటినే ట్రంప్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అప్పట్లో మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అయితే, మార్లాకు ఆ లైఫ్ నచ్చలేదని ట్రంప్ ఓ ఇంటర్వూలో చెప్పాడు. తాను ప్రైవసీ కోరుకుందని, స్వతంత్రంగా బతకాలని అనుకుందని అన్నారు. బిజినెస్‌లో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీకి సమయం కేటాయించకపోవడం కూడా ఇందుకు కారణం అని అన్నారు.

మెలానియా ట్రంప్ (2005–ప్రస్తుతం): 2005లో ట్రంప్ మెలానియా క్నాస్ అనే ఒక మాజీ మోడల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు బారన్ ట్రంప్ ఉన్నాడు. 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యప్పుడు మెలానియా ఫస్ట్ లేడీ అయ్యారు.

తరవాత కథనం