BJP started communal politics: హైందవశంఖారావం పేరుతో విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ సభను నిర్వహించింది. అది హైంద విలువలను బోధించడానికి పెట్టలేదు. ఆ పేరుతో రాజకీయం చేసి ఆలయాలపై పెత్తనం పొందాలనే దురాశతో చేశారో కానీ మాట్లాడిన వాళ్లందరిదీ అదే తీరు. కాషాయం ధరించిన తర్వాత అన్నీ వదిలేస్తారు. కానీ అక్కడ కాషాయం ధరించిన ప్రతి ఒక్కరూ స్వార్థపూరిత ప్రసంగాలే చేశారు. హైందవ శంఖారావ సభను వీహెచ్‌పీ నిర్వహించినా ఏర్పాట్లన్నీ బీజేపీ నేతలే చూశారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు సభ సక్సెస్ కావడంతో తమ వంతు పాత్ర నిర్వహించారు.
ఆలయాలు ప్రభుత్వ అజమాయిషీలో వద్దని డిమాండ్
హైందవ శంఖారావ సభ లక్ష్యం ఆలయాల పాలన రాజకీయ కబంధ హస్తాల నుంచి విడిపించడమని వీహెచ్‌పీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షల దేవాలయాలను ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. దేశవ్యావ్తంగా హిందూ దేవాలయాలను రాజకీయ జోక్యం నుంచి తప్పించాలన్న డిమాండ్ ఉంది. ఇప్పటికిప్పుడు హిందూ ఆలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించాలంటే.. రాజ్యాంగంలోని అధికరణాలు 25, 26 లను సవరించి, ఆ తర్వాత రాజ్యాంగంలోని షెడ్యూల్-7లోని జాబితా-3లోని ఎంట్రీ నెం. 28 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేవాలయ చట్టాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాల దేవాలయాల చట్టాలను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఆలయాలను ఎవరికి అప్పగించాలి ?
ఆలయాలపై పెత్తనం ప్రభుత్వాలకు ఉండకూడదని.. హైందవులకే ఇవ్వాలని ఈ సభలో స్వామిజీలు ప్రధాన డిమాండ్ వినిపించారు. హైందవులంటే వీహెచ్‌పీ వాళ్లేనని.. మఠాలు, ఆశ్రమాల పేరుతో స్వామిజీలుగా మారిన వారేనని వారు చెబుతున్నారు. అంటే తమకే ఆలయాల బాధ్యత ఇవ్వాలంటున్నారు. అసలు వారికి ఉన్న అధికారిక అర్హత ఏమిటి?.వారిని ఏమైనా ప్రజలు తమ అధికారిక హైందవప్రతినిధులుగా ప్రజలు గుర్తించారా?. లేకపోతే వారు ఏమైనా హిందూత్వానికి.. దేవుళ్లకు ఏమైనా చేయలేనంత సేవచేశారా ?. ఏమీ చేయలేదు…కాషాయం ధరించి కాషాయం ధరించి తమను తాము హైందవ ఉద్దారకులుగా చెప్పుకుంటున్నారు. కానీ అలా ఇస్తే వారి మఠాల్లో ఎంత అరాచకం రాజ్యమేలుతుందో.. ఆలయాల్లోనూ అలాగే జరగదని గ్యారంటీ ఉందా ?
ఏపీలో మత రాజకీయాలు ప్రారంభమయ్యాయా?
కేంద్రంలో ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టే ఆ పని చేయవచ్చు. కేంద్రం చేతిలో ఉందని వీహెచ్ పీ అడిగిందని ఏ ప్రభుత్వమూ చేయదని అందుకే బీజేపీ నేతృత్వంలో ఇలా ఐక్యతా సాధన చేస్తున్నారన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు సంబంధంలేని కార్యక్ర్మం కావడంతో పెద్ద ఎత్తువ హైందవులు ఏకమయ్యారని అంటున్నారు. ఏపీలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక బీజేపీ , వీహెచ్‌పీకి దూరదృష్టి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీని మత రాజకీయాల కేంద్రంగా చేసే ప్రయత్నం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.