Mahabharat: మహాభారతం అనగానే.. పాండవులు-కౌరవులు-మయసభ-పాచికలు-ద్రౌపదీ వస్త్రాపహరణం- అరణ్యవాసం-అజ్ఞాతవాసం-కురుక్షేత్రం వరకూ ఎన్నో సంఘటనలు, ఎన్నో రాజ్యాలు, ఎందరో రాజులు చెప్పుకుంటూ వెళితే మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం కావాలి, ఏ వదులుకోవాలి , ఎక్కడ తగ్గాలి – ఎక్కడ నెగ్గాలి..ఇలా జీవితంలో ప్రతివిషయాన్ని బోధిస్తుంది. మహాభారతం గురించి కాసేపు పక్కనపెడితే.. ఇందులో కౌరవులున్నారు కదా.. వాళ్లకి ఆప్ఘనిస్తాన్ తో లింకుంది. ఎలా అంటే కౌరవుల తల్లి, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి పుట్టిన ఊరు గాంధారరాజ్యం.
అప్పటి గాంధార రాజ్యాన్ని ఇప్పుడు కాందహార్ అని పిలుస్తున్నారు. కురు క్షేత్ర యుద్ధం తర్వాత గాంధార రాజ్యంలో స్థిరపడిన వారంతా అక్కడి నుంచి ప్రస్తుత సౌదీ అరేబియా, ఇరాక్‌లకు వలస వెళ్లారు. ఆ తర్వాత గాంధార ప్రాంతంలో శివారాధకులు క్రమంగా అంతరించిపోయి బౌద్ధమతం వ్యాప్తి చెందింది.
చంద్రగుప్తుడు, అశోకుడు, టర్కీ విజేత తైమూర్ , మొఘల్ చక్రవర్తి బాబర్ లతో పాటు మౌర్య పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇందుకు నిదర్శనంగా ఆప్ఘనిస్తాన్ లో కొన్ని ప్రాంతాల్లో హిందు కట్టడాలు, స్తూపాలు బయటపడ్డాయి. కనిష్కుడి కాలంలో అక్కడి ప్రజలంతా హిందూ, బుద్ధిజం అనుసరించారు. గాంధార అంటే సువాసనలు వెదజల్లే భూమి అని అర్థం.. శివుడి పేర్లలో గాంధార ఒకటి..అందుకే ఇక్కడ అప్పట్లో శివభక్తులు ఎక్కువగా ఉండేవారు. కాలక్రమేణా కుషాన్ రాజ్యం అంతమైంది.
అరబ్ రాజుల దండయాత్ర తర్వాత మొదలైన మార్పు.. గజనీ దండయాత్ర తర్వాత పూర్తిగా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. నిత్యం ఏదో ఒక ఉద్రిక్తతలతో ఇక్కడి ప్రజలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుంటారు. దీనివెనుక ఎన్నో కారణాలున్నాయి.. అయితే ప్రధమ కారణం, ప్రధాన కారణం గాంధారి శాపం అని చెబుతారు.
తన జన్మస్థలం అయిన గాంధారరాజ్యానికి గాంధారి ఎందుకు శాపం పెట్టిందో వివరిస్తూ ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల చేతిలో కౌరవులంతా మరణించారు. ఆ విషయం తెలుసుకుని పరుగుపరుగున యుద్ధభూమికి వచ్చిన గాంధారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ బాధలో ఉండగానే ఇదంతా జరడానికి కారణం నువ్వు అందుకే కురువంశం నిర్వీర్యం అయినట్టే నీ యాదవ వంశం కూడా నిర్వీర్యం అయిపోతుందని శాపం ఇచ్చింది. గాంధారి ఇచ్చిన శాఫ ఫలితమే శ్రీకృష్ణుడిడి కొడుకు సాంబుడి కడుపున ముసలం పుట్టడం..శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి..ద్వాపరయుగం అంతం కలియుగం ప్రారంభమైంది.
ఇదంతా సరే.. తన గాంధార రాజ్యానికి ఎందుకు శాపం ఇచ్చిందంటే.. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు అండగా నిలిచి తన సంతానాన్ని హతమార్చిన కృష్ణుడిపై ఎంత ఆగ్రహం చెందిందో…అసలు కురుక్షేత్రం జరగడానికి ప్రధానకారణం ( మాయా పాచికలచో పాండవులు ఓడేలా చేసింది శకునే కదా) అయిన శకునిపై అంతే ఆగ్రహం ప్రదర్శించింది. తన కొడకుల మరణానికి కారణం శకుని అని భావించింది గాంధారి. అందుకే తన కుమారుల చావుకి కారణం అయిన గాంధార రాజు శకుని రాజ్యంలో ఎప్పుడూ ఎవరూ శాశ్వతంగా నివశించరు, సుఖ శాంతులు లేకుండా రక్తపాతం జరుగుతూనే ఉంటుందని శపించింది.
గర్భశోకంతో బాధపడుతున్న సమయంలో గాంధారి ఇచ్చిన శాప ఫలితంగానే ఆఫ్ఘనిస్తాన్‌లో ఎప్పుడూ శాంతి వాతావరణం ఉండదని నమ్ముతారంతా. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత మాత్రమే కాదు..అంతకు ముందుకూడా నిత్యం అరాచకాలే. దీనికి మొత్తం కారణం గాంధారి శాపమే అని నమ్ముతారంతా..
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!