Google Map ఎలా పని చేస్తుంది? ఈ సమాచారంతో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?

Google Maps

Google Maps: తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్ మ్యాప్. దూరం ఎంతైనా, ప్రాంతం ఎంత కొత్తదైనా బేఫికర్‌. చేతిలో మొబైల్‌, ఫుల్ ఛార్జింగ్, కాస్త ఇంటర్‌నెట్ ఉంటే చాలు ఎంత దూరమైనా ఎవరిపై ఆధార పడకుండానే సాగిపోతుంది. అయితే ఇక్కడ ఇంకకో విషయం గుర్తించాలి. ఇలా గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గూగుల్ తల్లి చెప్పిందని కళ్లు మూసుకొని యక్స్‌లేటర్ తొక్కి చనిపోయిన ఘటనలు తరచూ చూస్తున్నాం.

అయితే ఇంతకీ గూగుల్ మ్యాప్స్ ఎలా అప్‌డేట్ అవుతాయి. ఎన్నిరోజులకోసారి మ్యాప్స్ అప్‌డేట్ అవుతాయి. తరచూ అప్‌డేట్ కాకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు వేయడం,లేదా వంతెనుల నిర్మిస్తున్నారు. ఇలాంటివి గూగుల్‌ మ్యాప్‌లో కొన్నిసార్లు అప్‌డేట్ కావడం లేదు. అప్పటి వరకు ఉన్న అప్‌డేట్ ప్రకారం అక్కడ రోడ్డు ఉండి ఉండవచ్చు. కానీ వారం పది రోజుల్లో అక్కడ వంతెన పనులు ప్రారంభం కావచ్చు అలాంటి టైంలో కచ్చితంగా ఆ విషయాన్ని గూగుల్ గుర్తించలేకపోవచ్చు. దాన్నే నమ్ముకొని వెళ్తే మాత్రం ప్రమాదంలో పడినవాళ్లు అవుతారు.

Google మ్యాప్స్ లేదా ఇతర మ్యాపింగ్ టెక్నాలజీ వాళ్లు తమ డేటాను ఉపగ్రహ చిత్రాలు, ట్రాఫిక్ సెన్సార్లు, LiDAR-ఆధారిత భూగోళ కెమెరా మ్యాపింగ్ , వినియోగదారులు తరచూ వెళ్లే మార్గాలను ఆధారంగా చేసుకొని యాప్స్ అప్‌డేట్ చేస్తుంటారు. ఇలాంటి డేటాలలో ఎక్కడైనా సరే చిన్న లోపం తలెత్తినా లేకుంటే ఎవరైనా మిస్‌లీడ్ చేసినా మ్యాప్‌ యాప్స్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాయి. LiDAR వంటి టెక్నాలజీ నిజంగానే కచ్చితమైన సమాచారం ఇస్తుంది.

గడువు ముగిసిన లేదా సరికాని డేటా వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి మార్పులు, కొత్త నిర్మాణం లేదా మూసివేత గురించిన సమాచారం అప్‌డేట్ చేయకపోవడంతో ముప్పుగా మారుతోంది. Google మ్యాప్స్, ఇతర మ్యాపింగ్ సేవలు వినియోగదారుల నుంచి కొంత డేటాను సేకరిస్తాయి. ఆ డేటా సరిగ్గా రివ్యూ చేయకపోతే కూడా తప్పుడు సమాచారం అందుతోంది. బ్యాడ్ వెదర్, ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్లాట్‌ఫారమ్‌లు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయని చెప్పలేం.
చాలా సార్లు, వినియోగదారులు టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడతారు. కొన్నిసార్లు ఎదుటి వారిని అడగడానికి కూడా ఇష్టపడదు. కామన్‌సెన్స్‌ కూడా ఉపయోగించరు. ముఖ్యంగా కొండలు, రిమోట్ లేదా ప్రమాదకరమైన రోడ్లపై ప్రయాణించేటప్పుడు టెక్నాలజీపై ఆధారపడటం మరింత డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

Google లేదా ఇతర మ్యాపింగ్ యాప్‌లు ఎలా దారి చూపుతాయి?
ఉపగ్రహ చిత్రాలు, ట్రాఫిక్ సెన్సార్‌లు, LiDAR-ఆధారిత టెరెస్ట్రియల్ కెమెరా మ్యాపింగ్‌ని ఉపయోగించి మ్యాప్‌ యాప్‌లు పని చేస్తాయి. వారం పదిరోజులకోసారి ఈ డేటాని అప్‌డేట్ చేస్తుంటాయి. కొన్నిసార్లు సరిగా అప్‌డేట్ కాదు కూడా. ఈ మధ్య కాలంలో వినియోగదారులకు వేగవంతమైన మరియు సురక్షితమైన మార్గాన్ని చూపించడానికి ట్రాఫిక్ పరిస్థితులు, దూరం, రియల్ టైం డేటా ఇచ్చేందుకు AI టూల్స్ యూజ్ చేస్తున్నారు.

జపాన్ వంటి దేశాల్లో CORS (నిరంతరంగా పనిచేసే రిఫరెన్స్ స్టేషన్), ఉపగ్రహ ఆధారిత రియల్ టైం డేటా అప్‌డేట్ పరికరాలను ఉపయోగిస్తారు. ఇవి ఆయా మార్గాల్లో జరిగే మార్పులు, ప్రమాదాలు , ఇతర అంశాలను తక్షణ సమాచారాన్ని అందిస్తాయి. ఇలాంటి సాంకేతికత భవిష్యత్తులో Google Maps, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల అడాప్ట్ చేసుకుంటే మరింత ఎఫెక్టివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇవ్వగలవు.

తరవాత కథనం