నాగబాబును మంత్రిని చేస్తే జనసేనకు గండమే – ప్రజల్ని తక్కువ అంచనా వేస్తారా ?

నాగబాబును మంత్రిని చేస్తే జనసేనకు గండమే - ప్రజల్ని తక్కువ అంచనా వేస్తారా ?

Nagababu:   నాగబాబును మంత్రిని చేస్తే ప్రజల్లో జనసేన చులకన అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో పండిపోయిన ఎవరైనా ఒకే కులానికి, ఒకే కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రజలు సహించరు. జనసేన విషయంలో పవన్ కల్యాణ్ అదే తప్పు చేస్తున్నారు. నాగబాబును కులం ప్రకారం కాదని..కుటుంబం పరంగా చూడలేదని ఆయన పార్టీకి చేసిన సేవల ప్రకారమే మంత్రిని చేస్తున్నామని అంటున్నారు. కానీ ప్రజలు ఈ మాటల్ని .. వాదనల్ని ఏ మాత్రం సహించే అవకాశం కనిపించడం లేదు. 

మార్చిలో ఎమ్మెల్సీ ఇచ్చి నాగబాబుకు మంత్రి పదవి 

మార్చిలో నాగేంద్రబాబు ఎమ్మెల్సీ అవుతారని ఆ తర్వాత మంత్రిగా ప్రమాణం చేస్తారని పవన్ కల్యాణ్ చెప్పారు. నిజానికి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా లేకపోయినా మంత్రిగా ప్రమాణం చేయవచ్చు. అలా ప్రమాణం చేసిన ఆరు నెలల్లో ఏదో ఓ సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలన్నది రాజ్యాంగంలోని రూల్. ఈ ప్రకారం ఇప్పుడే ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేయవచ్చు. కానీ పవన్ కల్యాణ్ అంత తొందర అవసరం లేదని ఎమ్మెల్సీగా ఎన్నికయిన తర్వాతనే  మంత్రిని చేయాలని నిర్ణయించుకున్నారు.  ఇటీవల రాజ్యసభ సీట్లలో ఒకటి బీజేపీకి ఇచ్చారు. నాగేంద్రబాబు త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఈ సారి ఖాళీ అయ్యే సీట్లలో ఎమ్మెల్సీగా బీజేపీ వారికి అవకాశం ఇచ్చే చాన్స్ లేదని అనుకోవచ్చు. అందుకే నాగబాబుకు ఇస్తారు. 

జనసేన నాలుగు మంత్రి పదవుల్లో మూడు ఒకే వర్గానికి !

ఇటీవల ఎమ్మార్పీఎస్ నేత పవన్ కల్యాణ్ పై సామాజికపరంగా చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి.  మంత్రి వర్గంలో మూడు మినిస్టీరియల్ పోస్టులు వచ్చిన దళిత,బీసీ,ఎస్టీ వర్గాలకు ఇచ్చేందుకు ప్రయత్నించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.  మంత్రి పదవులు  ఒకటి, రెండు కులాలకే ఇచ్చారని రెండు పదవులు ఇచ్చినా కనీసం మూడో పదవి అయినా ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల గురించి ఆలోచించాలి కదా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు.  ఈ మాటలపై చాలా చర్చ జరిగింది. ఎందుకంటే పవన్ సామాజిక న్యాయం గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు పాటించడం లేదు. నాలుగుపదవుల్లో మూడు ఒకే వర్గానికంటే చిన్న విషయం కాదు. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. 

కుటుంబ పార్టీ అన్న ముద్ర కూడా !

పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుటుంబం  మరో మంత్రిని కేబినెట్ లో కి తీసుకోవాలన్న ఆలోచన చేయకూడదు.కానీ చేశారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కుటుంబ పార్టీ అనుకుంటారు.అలా అనుకున్నప్పుడు సామాజిక పరంగా ఒకే వర్గానికి ప్రాధాన్యమివ్వడం వల్ల ఆ వర్గంలో వచ్చే ప్లస్ కూడా మైనస్ అవుతుంది. ఆయన సామాజికవర్గానికి కాదని కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. రాజకీయాల్లో అధికార స్థానంలో ఉన్న వారు నిర్ణయాలు తీసుకుంటే వెంటనే ప్రతిస్పందన రాదు. సమయం పడుతుంది. కానీ అప్పటికే జరగాల్సినా నష్టం జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పవన్ గుర్తించాల్సి ఉంది. కుటుంబసభ్యులు పార్టీ కోసం కష్టపడినా మన రాజకీయ వ్యవస్థలో వారిని కుటుంబంగానే పరిగణిస్తారు. ఇక్కడ పవన్  వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిందన్న అభిప్రాయం ఉంది. 

తరవాత కథనం