Social Media: భలేవారండి – సోషల్ మీడియాను మంచికే వాడాలా ?

భలేవారండి - సోషల్ మీడియాను మంచికే వాడాలా ?

Andhra Pradesh:  సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు ఈ ప్రపంచంలో జరిగాయో .. జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు.  ఫేస్ బుక్ వల్లనే ప్రపంచంలో ఎక్కువగా విడాకులు అవుతున్నాయి. జంటలు విడిపోతున్నాయి. అలాంటి స్థితిలో వచ్చి పడిన వాట్సాప్ , ట్విట్టర్, ఇన్ స్టా వంటివి వచ్చి పడ్డాయి. అయితే కల్లోలం అందరికీ అలవాటైపోయింది. వీటిని రాజకీయ నేతలు వాడుకోవడం ప్రారంభించిన తర్వాత డిజాస్టర్ గామారిపోయింది. ఇప్పుడు కొంత మంది నీతులు చెబుతూ బయలుదేరారు. మంచికే వాడదామంటూ పోస్టర్లు పెట్టేస్తున్నారు.

ఏపీలో పలు చోట్ల సోషల్ మీడియాపై పోస్టర్లు  

సోషల్ అందర్నీ దూషిస్తూ అదే భావ ప్రకటనా స్వేచ్చ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఇతరుల్ని తిట్టడం భావ ప్రకటనా స్వేచ్చ కాదని పోలీసులు జైళ్లకు పంపుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పలు చోట్ల ప్రత్యేకమైన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దంటూ…  అమరావతితో పాటు తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఏపీలోని ప్రధాన నగరాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అసత్య ప్రచారాలకు, దూషణలకు చెక్ పెడదామని నినాదాలను ఈ ఫ్లెక్సీల్లో పెట్టారు.  చెడు విషయాలు పోస్ట్ చేయవద్దు.. నైతికంగా పతనం కావొద్దు అని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిస్తున్నారు.          

సోషల్ మీడియా అంటేనే చెడు – మంచి ఎక్కడి నుంచి వస్తుంది ? 

అందరికీ అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో వీటిని ఏర్పాటు చేశారు.సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ద్వారా చైతన్యం తెచ్చేందుకు  వీటిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న చిన్న పోస్టర్లు కాదు ఏకంగాపెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశం అవుతున్నాయి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న అనర్థాలు.. మంచి కోసం ఎలా ఉపయోగించుకోవాలన్న  చర్చ కూడా వీటి వల్ల నడుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..   వీటిని ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై మాత్రం స్పష్టత లేదు.         

ఇంత ఖర్చు పెట్టి నీతులుచెబుతోంది ఎవరు ?

సలహాలు, నీతులు ఉరకనే చెబుతారు. భారీ హోర్డింగ్‌లకు వేలల్లో వసూలు చేస్తారు ఇలా అన్ని సిటీల్లో వేయాలంటే లక్షలు ఖర్చవుతుంది. అయినా ఎవరూ ఖర్చు పెట్టి చెప్పరు. కానీ ఏపీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఎవరి పేర్లు లేవు.  ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే.. జారీ చేసిన వారు సమాచార, ప్రచార సంబంధాల శాఖ అని వేసుకునేవారు. కానీ అలా వేయలేదు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసి ఉంటే అంత ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేసుకోకుండా ఉంటారా D కానీ చేసుకోలేదు.  అందుకే ఈ ఫ్లెక్సీలు మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. కానీ ఇలా నీతులు చెప్పి మరీ ఫ్లెక్సీలు వేస్తోంది ఎవరన్న చర్చ మాత్రం నడుస్తోంది. 

నిజంగా సోషల్ మీడియాను ఉపయోగించుకున్న వాళ్లు పద్దతిగా ఉపయోగించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. కానీ షార్ట్ కట్ అలవాటుపడేవాళ్లు మాత్రం దీన్ని ఓ ఓ టూల్ గా ఉపయోగించుకుని కలుషితం చేస్తున్నారు. అక్కడే అసలు సమస్య వస్తోంది.

తరవాత కథనం