BRS No More : భారత రాష్ట్ర సమితి నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ సోషల్ మీడియాపై అదుపు లేకుండా ఖర్చు పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరుగులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన పార్టీపై మళ్లీ సానుభూతి కనిపిస్తున్న సూచనలు కనిపించడం లేదు. కేసీఆర్‌ను అలా దాచి దాచి ఒక్క సారిగా ఆయనను బయటకు తీసుకు వచ్చి హైప్ క్రియేట్ చేసి తెలంగాణ జాతిపితపై ప్రజలు ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారని షో చేయాలని అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్‌కు అర్థమైనా ఇంకా ఆర్థం కానట్లుగా నటిస్దూ ప్రయత్నాలు చేస్తున్న విషయం ఏమిటంటే బీఆర్ఎస్ గేమ్ ఈజ్ ఓవర్.. ఇప్పటికే బీఆర్ఎస్ రాజకీయంగా శ్వాస వదిలేసింది. దానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ వాదమే బీఆర్ఎస్ లీడర్, క్యాడర్ – ఇప్పుడదిలేదు !
భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకంగా క్యాడర్ లేదు. ఉన్నదల్లా భావోద్వేగంతో వచ్చిన బలం మాత్రమే. ఆ భావోద్వేగం ఇతర పార్టీలకు చెందిన అనేక మందిని బీఆర్ఎస్ సానుభూతిపరులుగా మార్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సహజంగానే అది తగ్గుముఖం పట్టింది. పదేళ్ల తర్వాత పూర్తిగా కనుమరుగు అయింది. ఈ విషయాన్ని గుర్తించే కేసీఆర్ టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి ఓ ప్రయోగం చేశారు. కానీ అది కూడా వికటించింది. ఇప్పుడు కేసీఆర్ ముందు ఎలాంటి దారులు లేవు. కొత్తగా సెంటిమెంట్ రేపడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ వచ్చేసింది. అంతా తెలంగాణనే కనిపిస్తోంది. సొంత వారిని పరాయివారుగా ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
బీఆర్ఎస్ ఓటర్లు ఇప్పుడు బీజేపీ సొంతం
భారత రాష్ట్ర సమితికి ఇక గ్యారంటీ లేదనడానికి పార్లమెంట్ ఎన్నికలే సాక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ కు ప్రజల్లో కాస్తంత పలుకుబడి ఉంది. కానీ ఎప్పుడు అయితే ఓడిపోయిందో అప్పుడు ఇక ఆ పార్టీ అవసరం తెలంగాణకు లేదని ప్రజలు ఓ నిర్దారణకు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మూడు అంటే మూడు అసెంబ్లీ అస్థానాల్లో మాత్రం ఆ పార్టీకి మెజార్టీ వచ్చింది. సిద్దిపేట,గజ్వేల్‌తో పాటుమరో నియోజకవర్గం మాత్రమే. సిరిసిల్లలోనూ బీజేపీకి మెజార్టీ వచ్చింది. పార్లమెంట్ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్లు కోల్పోయారు. మిగిలిన చోట్ల మూడో స్థానానికి కరీంనగర్ వంటి చోట్ల లక్ష ఓట్లు తెచ్చుకోలేదంటే పరిస్థితి ఎలా మారిపోయిదో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ఓటర్లంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు. కేసీఆర్‌కు సీన్ అర్థమైపోయింది కాబట్టే ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు.
బీఆర్ఎస్ ఎంత శ్రమించినా బీజేపీకే లాభం
తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షంగా బీజేపీ అంత తీవ్రంగా శ్రమించడం లేదు. రిలాక్సింగ్ మోడ్‌లో ఉంది. రాజకీయం ఎలా చేయాలో బీజేపీ అగ్రనేతలకు తెలుసు. అందుకే వారు ప్రస్తుతానికి బీఆర్ఎస్ కు గ్రౌండ్ వదిలేసినట్లుగా కనిపిస్తున్నారు. కానీ వారి రాజకీయాల్ని ఊహించడంఅంత తేలిక కాదు. అసలు కాంగ్రెస్ కు చాన్స్ లేదు.. ముక్కోణపు పోరులో బీజేపీకి కూడా చాన్స్ లేదు.. మళ్లీ కేసీఆర్ జెండా ఎగరేస్తారు అనునే పరిస్థితి నుంచి బీజేపీని రేసు నుంచి తప్పించి మరీ బీఆర్ఎస్‌ను పడగొట్టారు. బండి సంజయ్ నుబీజేపీ అధ్యక్షుడిగా తప్పించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి సులువే. లాంగ్ టర్మ్ రాజకీయాలు చేయడంలో బీజేపీ అగ్రనేతల స్టైలే వేరు. ముందు బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తున్నారు. తరవాత కాంగ్రెస్ పని చూస్తారు. బీఆర్ఎస్ ఇప్పుడు నిర్వీర్యం అయిపోయిందని వారికి తెలుసు. వారు ఎంత కష్టపడినా కాంగ్రెస్ ప్రభుత్వంపై పడే వ్యతిరేకత మొత్తం బీజేపీకే లాభిస్తుంది.
వచ్చే ఎన్నికలకు మళ్లీ బీఆర్ఎస్ ఎందుకు.. బీజేపీ అయినా ఓకే అనే నినాదం
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సైలెంటుగా ఉండదు.. చివరికి రెండేళ్లలో రాజకీయం పికప్ చేస్తుంది. పొటెన్షియల్ ఉన్న లీడర్లు ఉన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి ఇలా అందర్నీ.. తెలంగాణను నడిపించగలిగే సామర్థ్యం ఉన్న వారిగా ప్రజల ముందు ఉంచుతుంది. మరోసారి బీఆర్ఎస్ ఎందుకు… బీజేపీకి ఒక్క చాన్స్ ఇద్దాం అనే ఆలోచన ప్రజల్లోకి వచ్చేలా చేస్తుంది. దానికి తగ్గ రోడ్ మ్యాప్ ను ఇప్పటికే రెడీ చేసుకున్నారని.. ఇటీవల ప్రధాని మోదీ .. తెలంగాణ నేతలతో జరిగిన సమావేశంలో ఇచ్చిన సందేశం కూడా ఇదే. అయితే చేతులెత్తేసి ఖాళీగా ఉండలేరు కాబట్టి.. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దఖలు పడిన వనరులతో తన పోరాటం తాను చేస్తున్నారు.