Revanth Reddy : చంద్రబాబు శిష్యుడు – జగన్ ఫ్యాన్ – రేవంత్ దారి తప్పారా ?

చంద్రబాబు శిష్యుడు - జగన్ ఫ్యాన్ - రేవంత్ దారి తప్పారా ?

Ravanth And Jagan:  రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు. ఆయన విధానాలు నచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలో చేరమన్నప్పటికీ చేరకుండా టీడీపీలో చేరాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చంద్రబాబును  స్పూర్తిగా తీసుకుని పరిపాలిస్తున్నారా?. ఏడాది పాలన చూసిన ఎవరూ ఆ మాట అనడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా ఆయన పాలనను జగన్ పాలనతో పోలుస్తున్నారు. సినీ ఇండస్ట్రీని అచ్చం జగన్ లాగానే టార్గెట్ చేశారని దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. 

జగన్ లాగానే టాలీవుడ్‌ను రేవంత్ దారికి తెచ్చుకుంటున్నారా? 

రీల్ హీరోల కన్నా తానే రియల్ హీరోను అనిపించుకోవాలని జగన్ టాలీవుడ్ ను ఓ పట్టు పట్టారు. జగన్ అప్పట్లో టిక్కెట్ రేట్లను పది రూపాయలుగా ఖరారు చేశారు. దాంతో టాలీవుడ్ హీరోలంతా ఆయన వద్దకు వెళ్లారు. మీరు తెర హీరోలే నేను అసలైన హీరోను అని జగన్ వారి ముందు బిల్డప్ ఇచ్చారని ఆ తర్వాత బయటకు వచ్చిన వీడియోలు వెల్లడించాయి. ఈ అంశంపై అప్పట్లో జగన్ పై వచ్చిన విమర్శుల అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జగన్ ఫార్ములానే ఫాలో అవుతున్నారని ఇటీవల జరిగిన పరిణామాల్ని బట్టి అందరూ విశ్లేషిస్తున్నారు.   టాలీవుడ్ పరిశ్రమతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న విధానం చూసి చాలా మంది ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏదో జరుగుతోందని విశ్లేషిస్తున్నారు.  

కేసీఆర్ పేరు లేకుండా చేయాలన్న పట్టుదల 

తెలంగాణలో  అవసరం లేని పేర్లు, చిహ్నాల మార్పిడి జోరుగా సాగుతోంది. తెలంగాణ స్టేట్ కి టీఎస్ అనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే అది టీఆర్ఎస్ ను పోలి ఉందని టీజీ చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ లేదని బీఆర్ఎస్ ఉందని రేవంత్ కూడా గుర్తించలేకపోయారు. ఇదొక్కటి కాదు అక్కడ్నుంచి ప్రారంభించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారు. ఈ చర్యలతో ప్రజల్లో వస్తున్న ఒకే ఒక్క సందేహం.. ఎన్నో సమస్యలు ఉండగా వీటినెందుకు రేవంత్ రెడ్డి నెత్తికెత్తుకుంటున్నారు అని. దానికి ఆయన సమాధానం కేసీఆర్ పేరు కనిపించకుండా చేయడం. జగన్ కూడా చంద్రబాబు పేరు కనిపించకుండా చేయడానికి చాలా చేశారు. అయితే అవన్నీ ఆయనకు కలసి రాలేదు.

రేవంత్ రివర్స్ పాలన ట్యాగ్ పడితే ఇబ్బందే !

అధికారంలోకి వచ్చిన అందరూ తమకు అధికారం శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు. రేవంత్ కూడా దానికి అతీతం కాదు. అందుకే తనకు ఎదురు లేదని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని అనుకున్నారు . చివరికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా మిగిలారు. రేవంత్ రెడ్డి తాను పదేళ్లు సీఎం అని చెబుతున్నారు. కానీ ఇప్పుడు చేస్తున్న పరిపాలనే కొనసాగితే జగన్ కు వచ్చిన ఫలితాలే వస్తాయని అంటున్నారు. మరి ఇలాంటి అభిప్రాయాలు రేవంత్ రెడ్డి వరకూ వెళ్తాయో లేదో !

తరవాత కథనం