Pahalgam attack: పహల్గాం దాడి.. ఏపీ బాధితులకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి సంచలనం రేపింది. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాం ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ హింసకాండలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు.

నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించారు. అదే సమయంలో బాధిత కుటుంబాలకు చెరో రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

దేశంలోనే ప్రతి ఒక్కరూ ఈ ఉగ్రవాద దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమి చేయలేవని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని.. చొరబడుదారులను సరిహద్దుల్లో సమర్థంగా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.

భారత్లో అస్థిరత సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర పండుతున్నాయని ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని చెప్పుకొచ్చారు. ఈ ఉగ్రవాద దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్.. విశాఖపట్నం కు చెందిన చంద్రమౌళి మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

తరవాత కథనం