pawan kalyan wife anna Lezhneva: కొడుకు క్షేమం.. తిరుమలలో మొక్కులు చెల్లించుకున్న పవన్ భార్య!

గత వారం సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి నల్లటి పొగ వెళ్లడంతో మార్క్ శంకరును ఐదు రోజులు పాటు హాస్పిటల్లోనే ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో ఉన్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో ఆ రాత్రి సింగపూర్ కు బయలుదేరారు. ఆయనతో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ కు వెళ్లారు. అనంతరం మార్క్ శంకర్ ఆరోగ్యం సురక్షితంగా ఉండడంతో పవన్ దంపతులు తమ కుమారుడిని సింగపూర్ నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు.

ఈ క్రమంలో తమ బిడ్డ సురక్షితంగా ఉండడంతో తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లు అయిందని పవన్ సతీమణి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె మొక్కులు తీర్చుకోవడానికి ఆదివారం తిరుమల చేరుకున్నారు. అక్కడ టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ డాక్యుమెంట్స్ పై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుని పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు.

అనంతరం సోమవారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు అన్నా లెజ్నోవ టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందించారు. అనంతరం తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఆమె అన్న ప్రసాదం స్వీకరించారు.

తరవాత కథనం